సాహితి

కర్మ క్షేత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తపించిపోతున్న ఆవిరి
ఆత్మత్యాగాన్నందిపుచ్చుకొని
మేఘం
నేల మీద చినుకు దోసిలి విప్పటమే
కర్తవ్యోపమ... అప్పుడే కద
ఆకాశం జలప్రవాహమై భూగోళాన్ని
కశ్మల రహితంగా కడిగేది
తడిసి మనిషి తరువయ్యేది...

పరుగులు పెడుతున్న పంట కాల్వ గలగలల్లో
ఏరువాక సంగతులు భాషాతీతంగా
హలమంత్ర పరాయణస్వామి భుజం మీద
బహిర్గతవౌతాయి
గమనించావో లేదో- జీవితపు రంగుల్ని కలబోసుకుని
ప్రవాహ సుషిమాలో ప్రాభాత సంధ్యని మోస్తూ
ఇదిగో- ఇది
ఒక యుగానికి ఆ కల తీర్చే ఆరాటం...

జీవన ప్రాయోజిత బకీర్షగా ఆదర్శ పరిష్ఠమై
ఎగురుతున్న పైరు జండాలు
పంట పొలాల్లో పసిడిని విరజిమ్ముతాయి
నెలవంక లాంటి కొడవలికి
కేదార శయ్యాసుషుప్తి గరిమలో
పనలు పనలుగా కలలు ఫలిస్తాయి
గంటల మెడలూపుకుంటూ దూరంగా
జోడెద్దులబళ్ళు...

నవతరాన్ని ధ్యానిస్తున్న కాలానికి
ఋతువులు గాలికి కొట్టుకుపోవటం
ఒక తైత్రోదయ సాక్షాత్కారం కోసమని తెలుసు
తమస్సంధ్యా ఝంఝల్ని శరుణాత్మకంగా భరించి
ఎంత నిత్యనూతనంగా ప్రభాతాన్ని
ఊరెరిగిస్తున్నది...?
రాత్రి చీకటి శూన్యాన్ని వేకువ వెలుతురులో నింపటం
భూమి సూర్యుడు కలిసి కుదుర్చుకున్న
ఒక మానవీయ ఒప్పందం...

నిశ్శబ్దాన్ని వహించి నిరంతరం భ్రమిస్తున్న ఈ నేల
పురాసౌమిక గంధాలయం
పరంపరానుగతమైన జన్మరహస్య శబ్దకోశం
గాలి చేత గాయపడ్డ ఆకుని
అక్కున జేర్చుకుని అగమంగా నిలుపుతుంది
జీవన తృష్ణకు
ప్రేమ రసంతో గొంతు తడుపుతుంది...

పురాతనానల పునీతమైన భూమి మీదనే
మానవజాతి మనుగడ
కాలి రాలిపోయిన నక్షత్రాలెన్నో
కంటికి కనిపించే జీవనోత్ఫుల్లం నేల మాత్రమే
అంధకారం వీస్తున్న గాలి వానకు
ఎదురు నిలిచి
ప్రాఖ్యాగ్ని ఛటనావహింపజేసుకున్న కర్మక్షేత్రం...!

- సాంధ్యశ్రీ, ఫోన్: 8106897404