సాహితి

అది హాస్యం కాదు.. అవహేళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రసభావం- అనౌచిత్యమున ప్రవర్తిల్లినచో రసాభాసమవుతుంది. అనౌచిత్యమనగా లోకమర్యాదను అతిక్రమించడం. పెద్దలను గౌరవించడం లోకమర్యాద. అపహాస్యము చేయగూడని గురువులు, పెద్దలు, దేవతలు మున్నగువారిని ఆలంబనం చేసుకుని ప్రవృత్తమైన హాస్యం, రసాభాసమవుతుంది.
విచిత్రమైన ఆకారము, వాక్కు, వేషము, చేష్టలు ఇత్యాదుల ప్రదర్శనవలన హాస్యం పుడుతుంది. ఉత్తములకు స్మిత, హాసితములు, మధ్యములకు విహాసిత, అపహాసితము, నీచులకు అపహాసితము, అతిహాసితము లక్షణాలుగా పేర్కొన్నారు ఆలంకారికులు (ఇక్కడ ఉత్తమ, పుణ్య, మధ్యమ, అథమ భేదాలు రచనలో ఆయా పాత్రల లక్షణం బట్టి గుర్తిస్తారు. కులాలకు జాతులకు సంబంధం లేదు).
ప్రాచీన భారతీయ ఇతిహాస పురాణాల్లో హాస్యం లేదు. ప్రాచీన నాటకకర్తలలో స.శ.పూ.4వ శతాబ్దంలోని భాసుడు- చారుదత్త నాటకంలో శకారుడు అనే పేరున్న రాజుగారి బావమరిది పాత్ర హాస్యాన్ని సృష్టించాడు. బాధ్యత లేని అధికారం ఎంత అనర్థదాయకమో రచయిత లోకానికి తెలిపాడు. రామాయణ, భారత కథలలోని పాత్రలను వరుసలు కలిపి మాట్లాడే ఆ మూర్ఖుడు, అతడి అనుచరులు గొప్ప హాస్యం ప్రదర్శిస్తారు. చిత్రమేమంటే శకారుడు ఈనాటికీ మనకు సమాజంలో ఎక్కడ చూచినా కనిపిస్తాడు. ఈ పాత్ర సృష్టివలన ఖాసోహాసః- అనే నానుడి కూడా పుట్టింది. కాళిదాసాదుల నాటకాలలో విదూషకుని పాత్ర ఉంది. అతడు తిండిపోతు, నాయకుని మిత్రుడు. అతడివల్ల చక్కని హాస్యం పుట్టింది. ప్రాచీన గ్రీకు సాహిత్యంలో కామెడీకి (హాస్యం) గౌరవం లేదు.
ళ్యౄళజూక జఒ జౄజఆ్ఘఆజ్యశ యచి ౄళశ త్యీఒళ ఆ్ద్ఘశ ఘ్పళ్ఘ్ళూ; ళజూజషఖ్యఖఒ త్దీజష్ద జఒ ఘ ఒఔళషజళఒ యఛి ఆ్దళ ఖక. దళ ళజూజషఖ్యఖఒ ఘౄక ఇళ జూళఛిజశళజూ ఘఒ ఘ ౄజఒఆ్ఘరీళ యూ జూళచ్యిౄజఆక, శ్యఆ ఔ్యజూఖషఆజ్పళ యచి ఔ్ఘజశ యూ ద్ఘూౄ ఆ్య యఆ్దళూఒ, ఆ్దళ ఘౄఒరీ ఆ్ద్ఘఆ ళనషజఆళఒ ఘఖదఆళూ, జఒ ఒ్యౄళఆ్దజశ ఖక ఘశజూ జూజఒఆ్యఆళజూ తీజఆ్ద్యఖఆ ష్ఘఖఒజశ ఔ్ఘజశ. జఒఆ్యఆళ
అరిస్టాటిల్ నిర్వఛనం ప్రకారం ఇతరులకు బాధ, అపకారం కలిగించేది హాస్యం కాదు. హాస్యరచనలు అథమస్థాయికి చెందినవని ఆయన నిర్ణయము. షేక్స్పియర్ కాలం నాటికి నాటకాల్లో హాస్యపాత్రలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఫలాస్ట్ఫా, మెల్వీలియో ఉత్తమ హాస్యపాత్రలు. డాన్ క్పిక్సాట్ పాత్రను సెర్వెంటస్ సృష్టించాడు. జొనాథన్ స్విప్ట్ రచించిన గలివర్స్ ట్రావెల్స్ ఉత్తమ హాస్య రచన. దీనివలన ఆనాటి ప్రభువుల పరిపాలన, వారి యుద్ధాలు విమర్శించాడు రచయిత. హాస్యానికి రసస్థాయి కలగాలంటే అది ఇతరులను నొప్పించకూడదు అని అందరూ అంగీకరిస్తారు. హాస్యం చక్కిలిగింత పెట్టినట్లుండాలి. సూదితో గుచ్చినట్లు కాదు. ప్రతాపరుద్రీయంలో- ఓడిన శత్రురాజుల ప్రవర్తన హాస్యానికి ఆలంబన-
‘‘శత్రు రాజులు ప్రచ్ఛన్నరూపులై- స్ర్తి వేషములలో తిరుగుచుండగా దుండగీండ్రు వారిని చూసి దువ్వలువలూడ్చి- హీ, హా అని నవ్వసాగిరి’’.
మరొక ఉదాహరణలో గర్విష్ఠి అయిన పండితుని అవహేళన చేస్తారు. ‘అయిదు దినాలలో మీమాంస శాస్త్రాన్ని మిడికి, మూడు దినాల్లో వేదాంతం వెలిగించి, తర్కశాస్తమ్రును మూజూచి కుక్కుట మిశ్రపాదులు వచ్చారు. ఏదో కొంచెం చదివి- తాను సర్వాధికుడననే వానిపై వ్యంగ్యం ఇది. చాకలి ఆలస్యంగా బట్టలుతేవడం అన్ని కాలాల్లోనూ ఉంది.
చాకివాని తోడ జగడాలు పడలేక..సిరిగలాడు పట్టుచీర కట్టె
శివుడు తోలుగప్పె, సీయని మదిరోసి.. భైరవుండు చీర పారవైచె...ఇక్కడ చాకలివానిని గాని, పురాణ పాత్రలను గాని నిందించలేదు. ఇది హాస్యం. భవభూతి ఉత్తర రామచరిత్ర నాటకంలో సౌధాతకి, ఖండాయనుడు అనే శిష్యులు వసిష్ఠ మహర్షిని పులితో పోల్చి నవ్వడం హాస్యరసాభాసమని లాక్షణికులు పేర్కొన్నారు. ఆధునిక తెలుగు సాహిత్యంలో హాస్యం పేరిట హాస్య రసాభాసాన్ని వ్యాప్తిచేశారు ప్రసిద్ధ రచయితలు.
చిలకమర్తి వారి ‘గణపతి’ ప్రసిద్ధమైన హాస్యనవలగా గుర్తించబడింది. ఒక మరుగుజ్జు, కురూపి- అతడి తల్లి ప్రధాన హాస్యపాత్రలు. పుట్టుకతో వచ్చిన వికృతరూపం ఆధారంగా ఇంత కథ నడపవచ్చునా? మరుగుజ్జులందరినీ ఏడిపించడం గదా ఇది. అమాయకురాలైన అతడి తల్లి వాడిని వెనకేసుకురావడం నేరమా? గణపతి తండ్రి కాకినాడలో నీళ్ళకావిడి మోసి, పొట్టబోసుకున్నాడు. గణపతి తాత పునహా పట్టణంలో పీనుగలు మోసి బతికాడు. ఇవి చెడ్డ పనులా? బంధుబలం లేనప్పుడు పీనుగను మోసేవాళ్లు కావాలా? ప్రజా ప్రయోజనం వున్న ఈ వృత్తులను హేళన చేయడం జుగుప్స కలిగిస్తుంది.
ఇందుకు వ్యతిరేకంగా మొక్కపాటి వారి బారిస్టరు పార్వతీశంలో ఉత్తమహాస్యం ఉంది. అమాయకుడైన ఒక యువకుడు, ఎలాగో లండన్ చేరి బారిస్టరు కావడం- అభినందించదగి అభివృద్ధి. ఈ నవలలో హాస్యం కేవలం పార్వతీశం అమాయకత్వానికి చెందినది. ఇంగ్లీషు వారి అలవాట్లకు, తెలుగు ప్రాంతంలోని అలవాట్లకు మధ్య నడిచింది హాస్యం. తెలుగువారి హాస్యరసాభాసం తారస్థాయికి చేరింది నాటకాల్లో!
గిరీశం అనే ఆషాఢభూతి పాత్ర ద్వారా గురజాడవారు హాస్య చిత్రణ ప్రారంభించారు కన్యాశుల్కం నాటకంలో.
జంఝం పట్టుకొని దొంగ ప్రమాణం చేసి, ఇంతకాలానికి జంఝంపోస వినియోగంలోకి వచ్చిందనడం, సనాతన ధర్మా నే్న అవమానించడం. అతడి శిష్యుడు వేంకటేశం- చేగోడీచమే అంటూ వేదంలోకి రుద్ర చమకాన్ని హేళన చేస్తాడు. కరటకశాస్త్రుల శిష్యుడు సంస్కృత భాషను హేళన చేస్తాడు. అగ్నిహోత్రావధానులు సంధ్యావందనం చేస్తూ మధ్యలో తిట్టడం, దొంగ జాతకాలు సృష్టించడం- ఇలా సనాతన ధర్మంలోని అంశాలను హేళన చేస్తాడు రచయిత. తులసివనంలో గంజాయిమొక్క పుడితే తులసివనం అపవిత్రమవుతుందా? కన్యాశుల్కం ఆనాడు అన్ని కులాల్లోనూ ఉంది. ఆ దురాచారం ఈనాడు లేదు. కారణం గురజాడవారి నాటకం కాదు. సమాజంలో ఆడపిల్లల సంఖ్య పెరిగి కన్యాశుల్కం నశించింది.
కందుకూరి వీరేశలింగంగారు గొప్ప సంఘ సంస్కర్త. ఆయన వ్యంగ్య రచనల్లో చాలావరకు హిందువులను అవమానించేవే. శవాలు మోసేవాళ్ళ దురాశ, పురోహితుల దానాలు ఇలాంటివే కథా వస్తువులు. ఎవరో కొందరున్నంత మాత్రాన ఆయా వ్యవస్థలను హేళన చేయడం నాగరికత కాదు.
ఇక పానుగంటి వారి కంఠాభరణం నాటకం-
అందులో సోమావధానులు అనే పాత్ర సృష్టించారు. భాషాజ్ఞానము లేని, మూఢాచారాలను పట్టుకుని వేలాడే బ్రాహ్మణుడు. ఘటశ్రాద్ధానికి ముందుగానే పర్ణకుటీరాలను ఏర్పరచడం, నలుగురు కూతుళ్ళకు నాలుగు విధవా గృహాలు కట్టించడం-ఎంత మూర్ఖుడైనా ఇటువంటి పనులు చేస్తాడా? వెగటుపుట్టే హాస్య రసాభాసం ఇది. పైగా ఒక నవాబు పాత్ర ద్వారా - తెలుగు వట్టి గడ్డి బాస, ఇస్‌మే రస్ నహీ ఔర్ జీవ్ నహీ అనిపిస్తాడు!
వేదం వేంకటరాయ శాస్ర్తీగారు బొబ్బిలియుద్ధం నాటకంలో మరింత రసాభాసం చేశాడు. ‘నా పృష్ఠోష్ఠ పర్యంత భోజనానికి- అంటే వీపు గుద్దితే నోటిగుండా మెతుకులు పడాలి- ముక్కును నులిమితే వీశెడు నెయ్యి కారాలి’- కూర్చున్న పీటలు పగిలిపోవాలి. ఇలాంటి హాస్యం రసాభాసం కాదా? ఇక ప్రసిద్ధి చెందిన పౌరాణిక నాటకాల్లో గయోపాఖ్యానం ఒకటి. మాయామానుష వేషధారి శ్రీకృష్ణుడు- మహాధనుర్థరుడు పార్థుడు. ఈ కథ పురాణాలలో లేదు. కృష్ణార్జునులు ఒకరినొకరు దెప్పిపొడవడం ఆ పాత్రల గొప్పదనాన్ని తగ్గిస్తుంది. దీనివలన ఏమి సాధించాడు కవి? చిలకమర్తి వారు పురాణ పాత్రలను ఎగతాళి చేయడం గణపతిలోనూ ఉంది. శుక్లాంబరధరం, విష్ణుం, శశివర్ణం, చతుర్భుజం- అంటూ గణాధిపతిని ప్రార్థిస్తాము.
గాడిదపరంగా దీనికి అర్థం చెబుతాడు-
తెలుగు నాటకాల్లో కాళ్ళకూరి వారి వరవిక్రయం ఉత్తమ తరగతికి చెందిన హాస్యం అందిస్తుంది. డబ్బుకోసం, పిల్లవాడి తల్లిదండ్రులు, అధికారం మాటున ఉపాధ్యాయులను ఏడిపించే వెంగళప్పలు- పెళ్ళిళ్ళ బేరగాళ్ళు- పెళ్ళిలో ఆచారాలు- సంఘాన్ని దారిలో పెట్టే అంశాలు. హాస్యం అలా ఉండాలి. అక్కడ ఎవరినీ హేళన చేయలేదు.
గురజాడ, కందుకూరి, చిలకమర్తి, పానుగంటి, వేదంవారు- వీరంతా స్వతంత్రం రాకముందు రాశారు నవలలను, నాటకాలను. ముస్లిము వ్యవస్థలోని లోపాలనుగాని, క్రిస్టియన్ వ్యవస్థలోని లోపాలనుగాని వీరు విమర్శించలేదు. వీలున్నచోట అభినందించారు కూడా. ఎందుకు? వారి జోలికి పోయే ధైర్యం లేక- ఎదురుతిరగలేరు అనే ధైర్యంతో బ్రాహ్మలను, వైశ్యులను మాత్రమే హేళన చేశారు. లోపాలు ఈ రెండు కులాల్లో మాత్రమే కనిపించాయా? కాబట్టి ఈనాటి వారికి వారసత్వంగా అందింది హాస్యరసాభాసం!
మొదటి తరం తెలుగు సినిమాలలో ఉదాత్తమైన హాస్యం ఉంది. మిస్సమ్మ, గుండమ్మకథ వంటి సినిమాలు, మాయాబజారు వంటి సినిమాలు పాత్రల ఔచిత్యాన్ని చాలావరకు దృష్టిలో నుంచుకుని చిత్రించబడ్డాయి. ఉపాధ్యాయుని, తెలుగు పాఠ్యాంశాన్ని హేళన చేయడంవల్ల పుట్టే హాస్యం ఏ తరగతికి చెందుతుంది? అధ్యాపక వృత్తి అంత నీచమైనదా? రెండవది పోలీసులను హేళన చేయడం- ఆయా కుటుంబాలవారు తలదించుకునేటట్లు చిత్రించాలా? ఒక గంటసేపు పోలీసు లేడు అనుకుంటే సమాజం ఏమవుతుందో ఆలోచించగలమా? ముహూర్తాలని, జాతకాలని పురోహితుల చుట్టూ తిరుగుతూ వారిని నీచాతి నీచంగా చిత్రించడం ఏ నాగరికత? ఒక ముల్లాను గాని, క్రిస్టియన్ ఫాదరీనిగాని విమర్శించరెందుకు? వారిని చూస్తే వీరికి చలిజ్వరం వస్తుంది కాబట్టి. హాస్యం ఉండాలి. అది గౌరవంగా ఉండాలి. కులాలు, వృత్తులు, వ్యవస్థలు హేళనకు అంశాలు కాకూడదు. సినిమా హాస్య ప్రభావం నేటి సమాజంమీద ఉంది- ఎలా? అది చెడు రూపంలో- మంచివైపు కాదు. ఉత్తమ హాస్యం సమాజం గౌరవాన్ని పెంచుతుంది. రసాభాసంవల్ల కలిగేది జుగుప్స మాత్రమే.

- పమిడిఘంటం సుబ్బారావు