అదిలాబాద్

వ్యవసాయ పనుల్లో రైతన్న బిజీబిజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోకేశ్వరం, జూన్ 11: ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు వ్యవసాయ పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. లోకేశ్వరం మండల కేంద్రంతో పాటు అబ్దుల్లాపూర్, కాండ్లి, కనకాపూర్‌తో పాటు వివిధ గ్రామాల్లోని రైతులు విత్తనాలు వేసేందుకు పంట పొలాల్లో సిద్ధం చేసుకుంటున్నారు. అదేవిధంగా వ్యవసాయ భూముల్లోని పత్తి కట్టెలు, తుక్కును తొలగించే పని పూర్తికావడంతో రైతులు పంటపోలాల్లో టాక్ట్రర్‌తో దున్నుతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందు పంట పొలాల్లో రైతులు వేసవి దుక్కిలు దున్నారు. వ్యవసాయ భూముల్లోని ముళ్ల పొదలు, పొదలను సహితం తొలగించారు. ముఖ్యంగా వేసవి దుక్కిలను సకాలంలో పూర్తి చేశారు. వ్యవసామ భూముల్లో రైతులు ట్రాక్టర్‌తో భూములను చదును చేస్తున్నారు. దాదాపు నెల రోజుల నుండి రైతులు దుక్కిల్లో బిజీబిజీగా ఉన్నారు. వ్యవసాయ భూముల్లో వేసిన పత్తి పంట, రబీ పంటలైన జోన్న, మొక్కజొన్న, శనగ, కుసుమ, గోధుమ పంటల భూములను దున్నుతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే వ్యవసాయ భూములను సిద్ధం చేసుకుంటున్నారు. రైతులు ఖరీఫ్ సీజన్‌లో అవసరమైన విత్తనాలు, ఎరువులను సహితం కొనుగోలు చేసుకుంటున్నారు. వేసవి దుక్కులు పంట దిగుబడికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. రైతులు ఇప్పటికే సేంద్రియ ఎరువులను కొనుగోలుచేసి వ్యవసాయ భూముల్లో చెల్లినట్లు వెల్లడించారు. గతంలో పంట పొలాల్లో రసాయనిక ఎరువుల వాడకం అంతంత మాత్రంగానే ఉండేదని రైతులు వివరించారు. గ్రామాల్లో తక్కువ ధరలకు సేంద్రియ ఎరువులు లభించేవన్నారు. రాన్రాను పశుసంపద తగ్గుతుండడంతో గ్రామాల్లో సహితం సేంద్రియ ఎరువుల కొరత ఏర్పడుతుందని పేర్కొన్నారు. సేంద్రియ ధరలు సహితం పెరిగిపోవడంతో రైతులపై అదనపు ఆర్థిక భారం పడుతుందని పలువురు రైతులు తెలిపారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌పై రైతులు ఎంతో ఆశతో ఉన్నారు. గత సంవత్సరం పంటల దిగుబడి ఆశించిన స్థాయిలో రాకపోవడంతో ఇబ్బందులు తప్పలేదని రైతులు అన్నారు. పండిన పంటలకు మద్దతు ధర తక్కువగా రావడంతో పెట్టిన పెట్టుబడులు సహితం రాలేదని తెలిపారు. ఇటీవలే వ్యవసాయ శాఖ అధ్వర్యంలో నిర్వహించిన మన తెలంగాణ- మన వ్యవసాయ గ్రామసభల్లో ఆధికారులు పంటల సాగులో తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారన్నారు. గ్రామ సభల ద్వారా పంటల సాగులో అనుసరించవలసిన అధునిక పద్ధతులపై అవగాహన వచ్చిందని వెల్లడించారు. ఖరీఫ్ సీజన్‌లో అయిన పంటల దిగుబడి పెరుగుతుందని ఆశతో ఉన్నామని రైతులు పేర్కొన్నారు.