కర్నూల్

విశ్రాంతికి సెలవు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జూన్ 11:వేసవి ముగిసింది.. వర్షాకాలం ప్రారంభమైంది.. ఇంత వరకూ ఎంతో కొంత విశ్రాంతి తీసుకున్న ప్రజలంతా ఇక మళ్లీ సాధారణ జీవనంలోకి అడుగు పెట్టనున్నారు. చిన్నారుల నుంచి పెద్దల వరకూ, నిరుద్యోగి నుంచి ఉన్నతాధికారి వరకూ అంతా ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యే సమయం ఆసన్నమైంది. ప్రధానంగా విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, రైతులు క్షణం తీరిక లేకుండా గడిపే సమయం ప్రారంభమైంది. ఇక నుంచి ప్రతి రోజూ ఉరుకులు, పరుగులు తీసేందుకు అన్ని వర్గాల ప్రజలు సమాయత్తమవుతున్నారు. వేసవి కాలమంటేనే అందరికీ విశ్రాంతి సమయం. ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్థులు వేసవి సెలవులు పూర్తి చేసుకున్నారు. ఉపాధ్యాయులు వేసవిలో కూడా కొంత పని చేయగా విద్యార్థులు అదనపు అర్హతల కోసం కోచింగ్ తరగతులకు వెళ్లినా ఎక్కువ సమయం విశ్రాంతి లభించింది. రైతులు రబీ సీజన్ కోసం మే మొదటి వారం వరకూ కష్టపడి ఆ తరువాత విశ్రాంతి తీసుకున్నారు. ఇంట్లో ఉంటూ క్షణం తీరిక లేకుండా తమ పిల్లలు, భర్తకు సేవలందించే గృహిణులు కూడా వేసవిలో కొంత విశ్రాంతి తీసుకున్నారు. ప్రధానంగా పిల్లలకు సెలవు కావడంతో అత్యధిక మంది గృహిణులు తమ సొంత గ్రామాలకు పిల్లలను తీసుకెళ్లి బంధు మిత్రులతో సరదాగా గడిపి తిరిగి ఇంటికి చేరుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో అత్యధికులు సెలవు పెట్టి మరీ ఇష్టమైన ప్రదేశాలకు వెళ్లి వచ్చారు. వ్యాపారులు సైతం వేసవిలో ఒకింత విశ్రాంతి కోరుకున్నా దుకాణాలు, కార్యాలయాలను మూసి వేయకుండానే సర్దుబాటు చేసుకుని వేసవి సెలవుల్లో ఆనందాన్ని అనుభవించారు. వేసవి ముగిసి నైరుతి రుతుపవనాలు ప్రవేశించి జిల్లా వ్యాప్తంగా చల్లటి వాతావరణం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతో ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్థులు బడిబాట పట్టనున్నారు. రైతులు వర్షాల కోసం ఎదురుచూస్తూ వేసవి దుక్కులు పూర్తిచేశారు. మంచి వర్షం వస్తే విత్తనం వేసేందుకు భూమిని సిద్ధం చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఉద్యోగులు, వ్యాపారులు అన్ని యాత్రలు ముగించుకుని తమ కార్యాలయాల్లో బిజీ కానున్నారు. ఉదయం నిద్ర లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకూ క్షణం తీరిక లేకుండా పనిలో నిమగ్నమయ్యే గృహిణులు విశ్రాంతి నుంచి బయటపడి తిరిగి అలుపు లేకుండా పని చేయడానికి భర్త, పిల్లలకు సేవలందించడానికి ఆనందంగా సిద్ధపడుతున్నారు. ప్రభుత్వం వర్షాకాలంలో రైతుల కోసం రైతు చైతన్య యాత్రలు, విత్తనాల పంపిణీ, రైతులకు సలహాలు ఇవ్వడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించడంతో వ్యవసాయ శాఖ అధికారులు, పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపర్చడానికి పంచాయతీరాజ్ శాఖ అధికారులు, శుద్ధి చేసిన తాగునీరు అందించడానికి గ్రామీణ నీటి సరఫరా అధికారులు, రైతులకు అవసరమైన సేవలు, సర్ట్ఫికెట్లు అందించడానికి రెవెన్యూ అధికారులు, అంటు వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేందుకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు గ్రామాల బాట పట్టనున్నారు. పురపాలక సంఘాల పరిధిలోని అధికారులు, సిబ్బంది కూడా పారిశుద్ధ్యం మెరుగున, శుద్ధిచేసిన తాగునీరు అందించడానికి పురపాలక సిబ్బంది వార్డు పర్యటనలు చేపట్టనున్నారు. మొత్తం మీద ప్రజలంతా వేసవి తీరిక నుంచి బయటపడి బిజీ జీవితానికి సిద్ధపడుతున్నారు.