కర్నూల్

శ్రీశైలంలో భక్తుల రద్దీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, జూన్ 11:ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీ బ్రమరాంభ మల్లికార్జునస్వామి వార్లను వేసవి సెలవులు ముగియనుండడంతో అధిక సంఖ్యలో భక్తులు శ్రీశైలం చేరుకున్నారు. రెండవ శనివారం, ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు దేశ నలుమూలల నుండి శ్రీశైలం చేరుకొని శ్రీ బ్రమరాంభ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకుని సేవించుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు శ్రీశైలం రావడంతో ఆలయ అధికారులు ఆలయ వేళల్లో మార్పులు చేయడం జరిగింది. వేకువ జాము నుండే దర్శనాలకు, ఆర్జిత అభిషేకాలకు భక్తులను అనుమతించడం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు శ్రీశైలం చేరుకుని పవిత్ర పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి తెల్లవారుజాము నుండే క్యూలైన్లలో స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు వేచి ఉన్నారు. భక్తులు అధికంగా శ్రీశైలం చేరుకోవడంతో అందరికి సంతృప్తికరంగా దర్శనాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో ఆలయ అధికారులు ఆళయ వేళల్లో మార్పులతోపాటు సామూహిక అభిషేకాలను క్రమపద్దతిలో నిర్వహించారు. సుమారు 60 వేల మంది పైగా భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారని అంచనా.
కెజిబివిలో ఉపాధ్యాయినుల బదిలీలు
కర్నూలుటౌన్, జూన్ 11:జిల్లాలోని కస్తూరిబా గాంధీ పాఠశాలల్లో ప్రభుత్వ నిబంధనల మేరకు బదిలీల కౌనె్సలింగ్ నిర్వహించామని 258 మందికి ప్రభుత్వ నిబంధనల మేరకు స్థానాలు కేటాయించామని జెసి-2 రామస్వామి తెలిపారు. కలెక్టర్ సత్యనారాయణ ఆదేశాల మేరకు శనివారం ఉపాధ్యాయుల కౌనె్సలింగ్ నిర్వహించి, ఆదివారం తన ఛాంబర్‌లో కౌనె్సలింగ్‌కు హాజరైన ఉపాధ్యాయుల పనితీరును పరిగణలోకి తీసుకుని ఖాళీగా ఉన్న స్థానంలో నియమించడానికి అర్హులైన ఉపాధ్యాయులను ఎంపిక చేసి జాబితాను కలెక్టర్‌కు పంపినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ విద్యాశాఖ ఉన్నతాధికారులు, కలెక్టర్ ఆదేశాలతో బదిలీల కౌనె్సలింగ్ నిర్వహించి ప్రభుత్వ నిబంధనల మేరకు పూర్తి చేశామని తెలిపారు. కలెక్టర్ ఆదేశాలతో సోమవారం బదిలీలైన ఉపాధ్యాయులకు ఉత్తర్వులు పంపిణీ చేస్తామన్నారు. సమావేశంలో పిఓ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.