కృష్ణ

మోగనున్న బడి గంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూన్ 12: మరో కొన్ని గంటల్లో బడి గంటలు మోగనున్నాయి. రెండు నెలల పాటు వేసవి సెలవులను ఆస్వాదించిన విద్యార్థి లోకం పుస్తకాలను చేతబట్టనుంది. తరగతి గదులన్నీ విద్యార్థులతో కళకళలాడనున్నాయి. వేసవి సెలవుల అనంతరం సోమవారం నుండి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ప్రతి యేటా అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం, పాఠశాలల పునః ప్రారంభాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమం పేరుతో ఊరూరా ర్యాలీలు నిర్వహించేవారు. అటువంటి ఈ ఏడాది సాదాసీదాగా పాఠశాలలను పునః ప్రారంభించనున్నారు. ఇటీవల వేసవి సెలవుల్లో ‘మన బడి - మన ఊరు’ పేరుతో డ్రాపౌట్స్‌ను గుర్తించిన విద్యా శాఖ, సర్వశిక్షాభియాన్ అధికారులు గుర్తించి వారంతా ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విధంగా చర్యలు తీసుకున్నారు. అయితే అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో జరగలేదు. పాఠశాలల పునః ప్రారంభం తర్వాత మరో విడత కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్న అధికారులు పత్తా లేకుండా పోయారు. జిల్లా విద్యా శాఖ, సర్వశిక్షాభియాన్ అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా ఎటువంటి హంగు, అర్భాటం లేకుండా పాఠశాలలు తెరుచుకోనున్నాయి. రెండు రోజుల కిందట జిల్లా విద్యా శాఖాధికారిగా ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎ సుబ్బారెడ్డికి ఉద్వాసన పలికి ఆయన స్థానంలో గుంటూరు డివైఇఓ పి రమేష్‌ను ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. అలాగే పాఠశాలల పునః ప్రారంభ సమయంలో ప్రభుత్వం పాఠశాలల హేతుబద్దీకరణ, ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియను చేపట్టింది. ఈ కారణాల వల్ల ఉపాధ్యాయులంతా ఎవరికి వారు బదిలీల హడావిడిలో ఉండిపోయారు. ఫలితంగా పాఠశాలల పునః ప్రారంభంనాటికి అసలు ఉపాధ్యాయుల హాజరు ఉంటుందా? లేదా? అనేది కూడా ప్రశ్నార్ధకంగా మారింది. మరో విషయమేమిటంటే పాఠశాలలు తెరుచుకునే రోజునే రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖపట్నంలో 13 జిల్లాల జిల్లా విద్యా శాఖాధికారులు, సర్వశిక్షాభియాన్ ప్రాజెక్ట్ ఆఫీసర్లు, డెప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లతో సమీక్ష సమావేశం నిర్వహించడం గమనార్హం. ఇటువంటి పరిస్థితుల్లో పాఠశాలల పునః ప్రారంభం సాదాసీదాగానే ఉంటుందని చెప్పవచ్చు.