Others

శోభన్‌బాబు మనసులోని మాట (శరత్కాలం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌లో తెలుగు సినిమా అభివృద్ధి జరుగుతున్న కాలంలో అగ్ర హీరోలతోపాటు నిర్మాతలు, దర్శకులు, ఇతర సాంకేతిక నిపుణులు హైదరాబాద్‌కు తరలి వచ్చి చిత్ర నిర్మాణంలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఖైదీబాబాయి చిత్రం శతదినోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆ చిత్రం హీరో శోభన్‌బాబు హైదరాబాద్‌కు వచ్చారు. ఆ సందర్భంలో బాలాజీ చిత్ర నిర్మాతలు టి బాబుల్‌నాథ్, జె లక్ష్మణరావులు శోభన్‌బాబుతో మాట్లాడుతూ ‘మీరు ఇంకా హైదరాబాద్‌కు మకాం మార్చలేదు?’ అని ప్రశ్నించారు. దానికి శోభన్‌బాబు సమాధానమిస్తూ ‘మద్రాస్‌లో స్థిరపడిన తెలుగు సినిమాను నమ్ముకొని కుటుంబంతో సహా అక్కడికి తరలివెళ్ళి పడాల్సిన కష్టాలన్నీ పడ్డాను. ఇప్పటికి ఈ స్థితికి చేరుకొన్నాను. అదృష్టంకొద్దీ నాకొచ్చిన అవకాశాలను సద్వినియోగపర్చుకుని తృప్తికరమైన జీవితం గడుపుతున్నాను. మద్రాసు నేలతల్లి నన్ను కరుణించింది. సొంత ఇల్లు కట్టుకునే స్థితిని కలుగచేసింది. ప్రతి మనిషి జీవితంలో సొంత ఇంటి యోగం, సొంత కారు యోగం జాతకంలో రాసివుంటుందంటూ వుంటారు. ఒక గంట ప్రయాణంతో హైదరాబాద్‌కి వచ్చి షూటింగ్ పని పూర్తి చేసుకొని తిరిగి మద్రాస్ వెళ్ళే సదుపాయం ఉన్నపుడు మళ్లీ ఇక్కడకు మకాం మార్చటం అవసరమా? అనిపిస్తుంది. ఏమంటారు? అని ఎదురు ప్రశ్నించారు. ఆ సందర్భంలో తీసుకొన్న ఈ అరుదైన ఫొటో ఇది. శోభన్‌బాబు తన సహచర సినీరంగ మిత్రులకు కూడా నేలమీద పెట్టుబడి పెట్టటం గురించి సలహాలిస్తూ ఉండేవారు. ఆ నేల తల్లే రియల్ ఎస్టేట్ రంగంలో శోభన్‌బాబుని శ్రీమంతుడిగా మార్చింది.

-పర్చా శరత్‌కుమార్ 9849601717