మహబూబ్‌నగర్

కార్పొరేట్ విద్యకు దీటుగా గురుకులాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్వకుర్తి, జూన్ 12: విద్య రంగంలో రాణిస్తే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని, కార్పోరేట్ విద్యకు దీటుగా అందించేందుకే రాష్ట్రంలో గురుకులాలను రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభించడం జరుగుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం పట్టణ కేంద్రంలో గల బిసి వసతి గృహంలో నూతన బిసి గురుకుల పాఠశాలను ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి జూపల్లి మట్లాడుతూ పేద విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి ఒక మైనారిటీ, బిసి ఎస్సీ గురుకుల పాఠశాలలను ప్రారంభించడం జరుగుతుందని, అలాగే విద్యార్ధులకు వౌలిక సదుపాయాలతో పాటు అన్ని రకాల సౌకర్యాలను అందించడం జరుగుతుందన్నారు. ఒక గురుకుల పాఠశాలకు 20 వేల కోట్ల రూపాయాలను కేటాయించడం జరిగిందన్నారు.
బంగారు తెలంగాణ దిశగా ముఖ్యమంత్రి పాలన కొనసాగిస్తున్నారని, దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని దేశానికే ఆదర్శంగా సిఎం పాలన ఉందని దేశ ప్రధాని మోదినే అభినందిచడం జరిగిందన్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో చదువుతున్న 54 మంది విద్యార్థులు ఐ ఐటి లో సీట్లు సంపాదించారని ఈ ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందని గతంలో కార్పోరేట్ పాఠశాలలో చదివిన విద్యార్థులు మాత్రమే సీట్లు సాధించే వారని ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాల విద్యార్థులు కూడా సాధించగలుగుతున్నారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, అర్డీఓ రాజేష్‌కుమార్, నగర పంచాయితీ చైర్మన్ శ్రీశైలం, ఎంపిపి రామేశ్వరమ్మ, తలకొండపల్లి జడ్పీటిసి నర్సింహ్మ, వైస్ ఎంపిపి పర్వతాలు, కౌన్సిలర్లు ఆనంద్‌కుమార్, సూర్యప్రకాష్‌రావు, శ్రీకాంత్‌రెడ్డి, సర్పంచ్ లు రాములు, దామోదర్‌రెడ్డి, జంగారెడ్డి, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వినయ్‌కుమార్, సిబ్బంది, ఎంపిడిఓ విశ్వనాథం, టిఆర్‌ఎస్ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, చిన్న, మక్బుల్, భూపతిరెడ్డి, మోహన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.