మెదక్

ఏడుపాయల అభివృద్ధికి ప్రత్యేక కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాపన్నపేట, జూన్ 12: తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా ఉన్న శ్రీ ఏడుపాయల వనదుర్గ్భావాని ఆలయాన్ని ఆధునిక హంగులతో అభివృద్ధి పరిచేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తానని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు తెలిపారు. సోమవారం మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గ్భావాని ఆలయ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ప్రమాణ స్వీకార సభలో ప్రసంగించారు. ఉమ్మడి జిల్లాలో వనదుర్గామాత ఆలయం ఎంతో ప్రసిద్దిగాంచిందని, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావించిన తరువాతనే ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఏడుపాయల ఆలయం అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందన్నారు. మహా శివరాత్రి, దేవి నవరాత్రులను అత్యంత వైభవంగా జరుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పెద్దయేత్తున నిధులను మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. సుమారు మూడున్నర కోట్ల రుపాయల ఆలయ అభివృద్దికి విడుదలయ్యాయని, భక్తుల వౌలిక వసతుల కల్పనకు నిధులు తోడ్పడుతున్నాయన్నారు. ఏడుపాయల కొత్త పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. భక్తులకు ఆధునిక పద్దతుల్లో ఏడుపాయల్లో టాయిలెట్ సౌకర్యాలు కల్పిస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా పాలకమండలి డైరెక్టర్లు ఆలయ అభివృద్దికి కృషి చేయాలని ఆయన సూచించారు. భక్తుల కోరికలు తీర్చే విధంగా భక్తులకు వౌలిక వసతుల సదుపాయల కల్పనలో ప్రత్యేక శ్రద్ధ చూపి అభివృద్ధి పనులు చేయించాలని మంత్రి డైరెక్టర్లకు సూచించారు. ఘణపురం ఆనకట్ట కాలువల ఆధునీకరణ, కట్ట బలోపేతానికి, ఎత్తు పెంచడానికి 43 కోట్ల రుపాయలు మంజూరు చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాతనే పాపన్నపేట మండలం అభివృద్ది దశలో పయణిస్తుందన్నారు. పాపన్నపేటలో మార్కెట్ యార్డు, రూ.1.50 కోట్లతో గుండువాగు పనులు పూర్తి అయ్యాయని ఆయన తెలిపారు. కొండ పోచమ్మ సాగర్ నుంచి గోదావరి నీళ్లను పాపన్నపేట మండలంలో కలిపి 30 వేల ఎకరాలను సాగులోకి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. పోతన్‌శెట్టిపల్లి నుండి ఏడుపాయలకు బ్రిడ్జి, చెక్‌డ్యామ్ పనులు నత్తనడకన నడుస్తున్నాయని, వెంటనే పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన అయిత చండీయాగం తదితర యాగాల వలనే సంవృద్ధిగా వర్షాలు కురిసి భారీగా పంటలు పండుతున్నాయన్నారు. ఏడుపాయల వనదుర్గామాత ఆలయాభివృద్దికి కార్యాచరణను రూపొందించామని, త్వరలోనే అభివృద్ధి పనులు వేగవంతమవుతాయన్నారు. ఇక్కడ రోడ్లు, బ్రిడ్జి వేశామని, జాతర ఉత్సవాలకు ప్రభుత్వం నిధులను మంజూరు చేశామని ఆమె వివరించారు. ఘణపురం ఆనకట్ట ఎత్తు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఆలయాభివృద్ధికి నూతనంగా నియామకమైన డైరెక్టర్లు ప్రతి ఒక్కరు శక్తివంచన లేకుండా కృషి చేసి భక్తులకు వౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేయాలని పద్మాదేవేందర్‌రెడ్డి సూచించారు. ఈ సమావేశంలో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మెదక్ కలెక్టర్ భారతి హొళ్లికేరి, ఆర్డీఓ నగేష్, తెరాస రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, ఆలయ ఈఓ టి.వెంకటకిషన్‌రావు, ఎంపిపి పవిత్ర దుర్గయ్య, జడ్పీటిసి సభ్యురాలు స్వప్న బాలాగౌడ్, మండల తెరాస అధ్యక్షులు ప్రశాంత్‌రెడ్డి, ఏడుపాయల ఆలయ చైర్మన్ పి.విష్ణువర్దన్‌రెడ్డి, డైరెక్టర్లు బి.నారాయణ, ఎస్.దుర్గయ్య, యం.నాగప్ప, టి.జ్యోతి అంజిరెడ్డి, ఎం.కిష్టయ్య, కె.ప్రభుగౌడ్, డి.శ్రీ్ధర్, జె.చంద్రయ్య, పి.కిషన్, టి.సంగప్ప, శ్రీనివాస్‌రెడ్డి, గౌరిశంకర్, యం.నాగరాజు, ఆలయ సిబ్బంది జె.రవికుమార్, సిద్దిపేట శ్రీనివాస్, తెరాస నాయకులు, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.

మెదక్ జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ చూపండి
మెదక్ రూరల్, జూన్ 12: వెనకబడిన మెదక్ ఇప్పుడిప్పుడే అభివృద్ధి పరుగందుకుంది...జిల్లా కేంద్రం ఏర్పాటు చేసినందున అభివృద్దికోసం ప్రత్యేక శ్రద్ధ చూపాలని మంత్రి హరీష్‌రావును డిప్యూటీ స్పీకర్ ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి కోరారు. సోమవారం వైపిఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన బిసి బాలికల గురుకుల పాఠశాల ప్రారంభోత్సవ సభలో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఉద్యమ నాయకుడు, ముఖ్యమంత్రి కెసిఆర్ విద్యా విధానంలో అనేక మార్పులు తీసుకువచ్చారన్నారు. అంగన్‌వాడి నుండి పిజి వరకు గురుకులాలు ఏర్పాటుచేసి నాణ్యమైన, వసతులు, భోజనం కల్పిస్తున్నారని పేర్కొన్నారు. మెదక్‌ను వెనక్కి నెట్టేశారని, ప్రస్తుతం జిల్లా కేంద్రం చేసినందుకు కెసిఆర్, హరీష్‌రావులకు కృతజ్ఞతలు తెలిపారు. సమగ్ర అభివృద్ధి కోసం మా మెదక్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల ఉందని, సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల కళాశాల ఉందని, తాజాగా బిసి బాలికల గురుకుల పాఠశాల ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. అయితే జిల్లా కేంద్రం, ఏకైక మున్సిపాలిటీ ఉన్నందున బిసి, మైనార్టీ బాలుర పాఠశాలలు మంజూరు చేయించాలని కోరారు.

సినారెకు కవులు, సాహితీవేత్తల నివాళి
సిద్దిపేట అర్బన్, జూన్ 12: తెలుగు సాహిత్య శిఖరం, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డా.సి నారాయణరెడ్డి మృతిపట్ల మరసం వ్యవస్థాపక అధ్యక్షుడు సిధారెడ్డి, అధ్యక్షుడు దేశపతి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి తైదల అంజయ్య, ఉపాధ్యక్షుడు రంగాచారి, అశోక్, వ్యవస్థాపకులు కె. అంజయ్య, శ్రీనివాస్, కిషన్, భగవాన్‌రెడ్డిలు సంతాపాన్ని తెలిపారు. ఆయన మరణం సాహితీలోకం విషాదంలో మునిగిందన్నారు. మారుమూల పల్లె హనుమాజీపేటలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆయన అసాధారణ ప్రతిభతో ఎదిగాడన్నారు. అద్భుత రచనల ద్వారా తెలుగు సాహిత్యాన్ని విశ్వవ్యాప్తం చేసి విశ్వాంభరునిగా నిలిచాడన్నారు. కథ, నవల, పద్యవచన, సాహిత్య ప్రక్రియల్లో అద్భుత రచనలు చేసి సాహిత్యంను చాటాడన్నారు. తెలంగాణ మట్టిపరిమళాలు, భాషను తన రచనద్వారా సహిత్యలోకానికి చాటాడన్నారు.

కాంగ్రెస్ బలోపేతానికి కృషి
జహీరాబాద్, జూన్ 12: కోహీర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఎమ్మెల్యే గీతారెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గీతారెడ్డి పలు అంశాల్లో వారికి మార్గనిర్దేశం చేశారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తీసుకోవాల్సిన చర్యలపై వారికి అవగహన కల్పించారు. గ్రామ స్థాయినుంచి అధికార పార్టీ అనుసరిస్తున్న రైతు, ప్రజా వెతిరేక విధానాలను ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రామలింగారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ ఇతర నాయకులు, ప్రతినిధులున్నారు.

మైనార్టీలు చక్కగా చదువుకోవాలి
జహీరాబాద్, జూన్ 12: కెజి టు పిజి విద్యాబోధలో భాగంగా సిఎ.కెసిఆర్ అనేక సంస్కరణలు తీసుకుని వచ్చారని ఎంపి.బిబి.పాటిల్ అన్నారు. సోమవారం కోహీర్‌లో మైనార్టీ గురుకుల పాఠశాలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ జె.గీతారెడ్డి, ఎమ్మెల్సీ ఎండి.్ఫరీదుద్ధీన్‌లు అతిథులుగా హాజరై పాఠశాలను, తరగతి గదులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుతోనే సంస్కరం వస్తుందన్నారు. మైనార్టీ తల్లిదండ్రులు తమ పిలల్లను చదివించాలన్నారు. ఎమ్మెల్యే గీతారెడ్డి మాట్లాడుతూ చదువు ప్రాధాన్యతను వివరించారు. విద్యార్థులు చక్కగా చదువుకోవాలన్నారు. ఎమ్మెల్సీ ఎండి.్ఫరీదుద్ధీన్ మాట్లాడుతూ కెజి నుంచి పిజి వరకు ప్రభుత్వం ఉచిత విద్యను అందించేందుకు కృషి చేస్తుందన్నారు. మైనార్టీ విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు కోసం కూడా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. ఈ సందర్భంగా పాఠశాల అవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు.