చిత్తూరు

ఐకార్ గుర్తింపులేని వ్యవసాయ విద్యకు విలువ ఉండదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 12: భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసిఎఆర్) అనుమతి పొందని వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు విద్యను అభ్యసిస్తే అవి ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోకి రావని, ఈ అంశంపై తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వర్శిటీ విసి వల్లభనేని దామోదర నాయుడు, అగ్రికల్చర్ డీన్ డాక్టర్ రమేష్‌బాబు తెలిపారు. సోమవారం వర్శిటీలో జరిగిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలో బాపట్ల, తిరుపతి, నైరా, మహానంది, రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాలలు ఉన్నాయన్నారు. ఇటీవల ప్రభుత్వం మంజూరు చేసిన తాడిపత్రి, అనంతపురం, కడపజిల్లాలోని బద్వేలు, శ్రీకాకుళంలోని ఏచర్ల, ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, సిఎస్ పురం మాత్రమే ఉన్నాయన్నారు. ఈ 11 విశ్వ విద్యాలయాలు మాత్రమే భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి అనుమతి పొందినవని తెలిపారు. మరే వ్యవసాయ కళాశాల పరిధిలోకి రావన్నారు. గుర్తింపు పొందని కళాశాలల్లో డిగ్రీలకు ఐకార్ అక్రిడేషన్ గుర్తింపు ఉండదన్నారు. బయటి వ్యక్తులు చెప్పే మాటలను తల్లిదండ్రులు నమ్మి మోసపోవద్దని వారు సూచించారు.
వ్యవసాయ విద్యకు రైతు కోటాకు ఎకరా భూమి ఉంటే చాలు
చిన్న, సన్నకారు రైతుల పిల్లలు వ్యవసాయ విద్యను పొందేందుకు వీలుగా ఎకరా భూమి ఉంటే చాలని వ్యవసాయ విశ్వ విద్యాలయ విసి వల్లభనేని దామోదర నాయుడు, డీన్ ఆఫ్ అగ్రికల్చర్ డాక్టర్ రమేష్‌బాబు తెలిపారు. వ్యవసాయ విద్యకు సంబంధించి అర్హులైన రైతుల పిల్లలకు రైతు కోటా కింద మూడు ఎకరాల భూమి విధిగా ఉండాలని నిబంధన ఉండేదన్నారు. సన్న, చిన్నకారు రైతుల పిల్లలు ఎక్కువ మంది వ్యవసాయ విద్యవైపు ఆసక్తి చూపాలంటే కొన్ని సంస్కరణలు చేపట్టాలని బోర్డు మీటింగ్‌లో చర్చించినట్లు వారు తెలిపారు. ఎకరా భూమి ఉంటే చాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి పంపి అనుమతులు పొందుతామన్నారు. ఈ అవకాశాన్ని రైతు కుటుంబాలకు చెందిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.