చిత్తూరు

శక్తివంతమైన బ్యాటరీలతో విద్యుత్ సరఫరాలో అంతరాయం నివారిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, జూన్ 12: తుఫాన్, ప్రకృతి వైపరీత్యాలు చోటుచేసుకున్న ప్రాంతాల్లో శక్తివంతమైన బ్యాటరీలతో విద్యుత్ సరఫరాలో అంతరాయాన్ని నివారిస్తామని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి కిమిడి కళావెంకటరావు వెల్లడించారు. విద్యుత్‌శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సోమవారం తొలిసారిగా మంత్రి చిత్తూరు నగరానికి విచ్చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే నివాసంలో అల్పాహారాన్ని స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యుత్ మిగులు రాష్టమ్రని, ఈ నేపధ్యంలో రాష్ట్రంలో శక్తివంతమైన ఇన్వర్టర్లు, బ్యాటరీలను ఏర్పాటు చేసి తుఫాన్, ఇతర ప్రకృతి వైపరీత్యాలు చోటుచేసుకున్న సమయంలో రెండు, మూడు రోజుల పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూస్తామని వెల్లడించారు. ఇందుకు సంబంధించి పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని రెండు జిల్లాల పరిధిలోని రెండు మండలాలను ఎంపికచేసి బ్యాటరీలను అమర్చుతామని వివరించారు. దేశంలోనే ప్రప్రథమంగా డిస్కమ్‌లను ఏర్పాటు చేసి విద్యుత్ పంపిణీ నష్టాన్ని గణనీయంగా తగ్గించామన్నారు. అదే క్రమంలో 28 శాతం ఉన్న విద్యుత్ పంపిణీ నష్టాన్ని కేవలం 9.5 శాతం వరకు చెల్లించామన్నారు. సోలార్ పంపుల పంపిణీ ద్వారా రైతులను ఆర్థికంగా ఆదుకుంటున్నామని వివరించారు. త్వరలోనే సోలార్ విద్యుత్ తయారీని కుటీర పరిశ్రమగా మార్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. విద్యుద్దీకరణ పనుల్లో దేశంలోనే తమ రాష్ట్రం మొదటి స్థానం ఆక్రమించిందని, రానున్న రోజుల్లో విద్యుత్ చార్జీలు గణనీయంగా తగ్గుతాయన్నారు. తెలంగాణా రాష్ట్రం నుంచి మన రాష్ట్రానికి విద్యుత్ బకాయిల కింద రూ. 4,400 వేల కోట్లు రావాల్సి ఉందని, అదే క్రమంలో బొగ్గు కొనుగోలు బకాయిల కింద మన రాష్ట్రం తెలంగాణాకు రూ.1500 వేల కోట్లు బకాయి ఉందన్నారు. సంబంధిత మొత్తాలు రాబట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నిధుల కొరత కారణంగా విద్యుత్‌శాఖలోని ఖాళీలను భర్తీ చేయలేకపోతున్నామని, కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న ఉద్యోగుల సర్వీసును కూడా రెగ్యులరైజ్ చేయలేకపోతున్నామన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ రాజసింహులు, ఎమ్మెల్యే సత్యప్రభ, టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి పులివర్తి నాని, టిడిపి రాష్ట్ర నాయకుడు బద్రినారాయణ, సర్పంచుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మోహన్‌రాజ్, కార్పొరేటర్లు అన్నపూర్ణ, కంద, టిఎన్‌టియుసి నేత చలపతి, ట్రాన్స్‌కో ఎస్‌ఇ హరినాథరావు తదితరులు పాల్గొన్నారు.