కడప

ఆర్భాటాలకే ప్రభుత్వం పరిమితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జూన్ 12: తెలుగుదేశం ప్రభుత్వం మూడేళ్ల పరిపాలనలో ఆర్భాట ప్రచారానికే పరిమితమైందని, సంక్షేమ పథకాలు అమలు చేయడంలో మీనమేషాలు లెక్కిస్తోందని పిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా.ఎన్.తులసిరెడ్డి విమర్శించారు. స్థానిక ఇందిరా భవన్‌లో సోమవారం ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం మంత్రులు పర్యటనలలో ఆకాశామే హద్దుగా పార్టీ ప్రచారాన్ని నిర్వహిస్తూ పబ్బంగడుపుకుంటూ కాలయాపన చేస్తున్నారని ప్రజలకు ఏమాత్రం సంక్షేమపథకాలు అమలుచేయడం లేదని ఘాటుగా విమర్శించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అమలు చేయడంలో కూడా విఫలమైందన్నారు. ఉపాధిహామీ పథకాన్ని మాత్రం తూ.తూ మంత్రంగా అమలు చేస్తున్నారు కానీ క్షేత్రస్థాయిలో ఎంతమందికి ఉపాధి లభిస్తుందో టిడిపి నాయకులకే తెలియదని, ఈ విధంగా పరిపాలన సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. అమరావతిలో నూతన రాజధాని నిర్మాణాల్లో ఎన్నో అవకతవకలు జరిగాయని అందుకు నిదర్శనమం. వారంరోజుల కిందట కురిసిన తేలికపాటి వర్షానికి నీరుకారడమే నిదర్శనమన్నారు. టిడిపి ప్రభుత్వం అవినీతికి, అసమర్థతతకు, మోసానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిందని పేర్కొన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలచేతుల్లో ఘోర ప్రభావం చవిచూస్తుందని జోస్యం చెప్పారు.
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన రుణమాఫీ పథకంతోపాటు డ్వాక్రారుణాలు మాఫీ చేయడంలో పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాపై మొదటి సంతకం చేస్తానని పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తెలియజేశారన్నారు. సమావేశంలో డిసిసి అధ్యక్షుడు షేక్ నజీర్ అహ్మద్, నగర అధ్యక్షుడు బండి జక్కరయ్య, పిసిసి కార్యదర్శి ఎస్‌ఏ సత్తార్, అధికార ప్రతినిధి నీలిశ్రీనివాసరావు, కె.చంద్రశేఖర్‌రెడ్డి, కాంగ్రెస్‌పార్టీ మహిళా అధ్యక్షురాలు సుజాతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.