శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

రహస్య సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జూన్ 12 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు, పార్టీల తాజా స్థితిగతులపై ఢిల్లీ నుంచి వచ్చిన ఓ బృందం నెల్లూరు జిల్లాలో గత కొన్ని రోజులుగా సర్వే నిర్వహిస్తోంది. చాలా పకడ్బందీగా, ఎవరికీ అనుమానం రాకుండా తమదైన శైలిలో బృంద సభ్యులు ప్రజల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు. వారం రోజుల క్రితం నెల్లూరుకు ఢిల్లీ నుంచి వచ్చిన ఓ బృందం నగరంలోని మాగుంట లేఅవుట్ ప్రాంతంలో ఓ ఇంట్లో అద్దెకు దిగి జిల్లాలోని అన్ని శాసనసభ నియోజకవర్గాల పరిధిలో రెండునెలల పాటు లోతుగా ఈ సర్వే చేసేందుకు ప్రణాళికలు రచించింది. ఒక్కో బృందంలో ఇద్దరు సభ్యులు ఉంటూ జిల్లా వ్యాప్తంగా బృందాలుగా విడిపోయి క్షేత్రస్థాయి నుంచి సర్వే జరుపుతుండటం గమనార్హం. జిల్లాలో ప్రధాన పార్టీల బలబలాలు మొదలు, ఎవరి వల్ల ఏ పార్టీకి ఎంత వరకు మేలు కలుగుతుంది, అందుకు కారణాలు కూపీ లాగుతున్నారు. అదేవిధంగా 2014 ఎన్నికల్లో జిల్లాలో వచ్చిన సాధారణ ఎన్నికల ఫలితాలను కూడా విశే్లషిస్తున్నారు. 2019లో ఎవరికి ఓటు వేస్తారు, ఎందుకు వేయబోతున్నారో తెలుసుకుంటున్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలనుకుంటున్నారో, అందుకు గల కారణాలు, ప్రతిపక్ష పార్టీగా వైకాపా ఎంత మేర తన ఉనికిని చాటుకోగలిగింది వంటి విషయాలను తెలుసుకుంటున్నారు. సామాన్యుల వద్ద మాత్రం కొన్ని విషయాలకు మాత్రమే పరిమితమవుతూ రాజకీయాలు, పరిపాలన పట్ల అవగాహన ఉన్న వారిని అంచనా వేసి వారి వద్ద ఎక్కువ సమాచారం తీసుకుంటుండటం విశేషం. గత మూడేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఎలా పనిచేసింది, మోదీ నాయకత్వం గురించి అభిప్రాయంతో పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం పట్ల కూడా ప్రజల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలో కులాల సమీకరణ వచ్చే ఎన్నికల్లో ఎంత మేర ప్రభావం చూపుతుంది, గతంలో ఎంత మేర చూపింది మొదలు కొత్తగా వస్తున్న జనసేన పార్టీకి ఓటు వేస్తారా? ఒక వేళ జనసేన అధికారంలోకి రాకుంటే ఆ పార్టీ వల్ల నష్టపోయే పార్టీలు ఏవి అని తెలుసుకుంటున్నారు. తాము ఓ సాధారణ ఏజెన్సీ నుంచి వచ్చామని, కేంద్రప్రభుత్వ పరిపాలనతో పాటు రాష్ట్రంలో పార్టీల స్థితిగతులను తమ నివేదికలో పొందుపరిచి తమ ఏజెన్సీకి అందించడమే తమ బాధ్యతగా వారు చెప్తున్నారు. అయితే బిజెపినే ఈ సర్వే చేయిస్తున్నట్లు అందరూ భావిస్తున్నారు. సర్వే చేసే వ్యక్తులు హిందీ, ఆంగ్లంలలో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బిజెపి ఎవరితో కలిస్తే బాగుంటుంది అని కూడా ప్రశ్నిస్తుండటంతో సర్వేలో పాల్గొన్న వారిలో అధికులు బిజెపినే ఈ సర్వే చేయిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. సర్వేలో బిజెపి రాష్ట్రానికి ఎన్నికల ప్రచార సభల్లో హామీనిచ్చి తర్వాత ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంపై ప్రజల నుంచి ఎక్కువగా నిరసన వ్యక్తమవుతున్నట్లు సమాచారం. కేవలం సాధారణ ప్రజలకే పరిమితం కాకుండా న్యాయవాదులు, పాత్రికేయులు, ఉద్యోగులు, కార్మికులు, వైద్యులు తదితర వర్గాలకు చెందిన వారిని కూడా కలుస్తూ వారి అభిప్రాయాలను సర్వేలో పొందుపరుస్తున్నారు. జిల్లాలోని సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల పట్ల ప్రభుత్వానికి ఏమి సూచిస్తారో చెప్పాలని కూడా వారు కోరుతుండటం గమనార్హం.