శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

వైభవంగా వెంగమాంబ గ్రామోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుత్తలూరు, జూన్ 12 : వెంగమాంబ బ్రహ్మోత్సవాల్లో సోమవారం రాత్రి గ్రామోత్సవం నిర్వహించారు. సంతానంలేని మహిళలు రెండోరోజు కూడా అమ్మవారి ముంగిట వరపడ్డారు. గ్రామోత్సవం వెంగమాంబ పుట్టినిల్లయిన వడ్డిపాళెం నుంచి ప్రారంభమై నర్రవాడ, గుదివారిపాళెం, ఉలవవారిపాళెం మీదుగా దేవాలయానికి చేరుకుంది. గ్రామోత్సవ సందర్భంగా ఈ ఏడాది ఆలయ అధికారులు, వ్యవస్థాపక ధర్మకర్త ప్రత్యేక వాహనాన్ని తయారు చేయించి ఆ వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో అమ్మవారి సన్నిధి కోలాహలంగా మారింది. ఈ ఏడాది ఉత్సవాల్లో తొలి, మలి రోజుల్లోనే ఎక్కువగా భక్తుల రాక ఉండటం విశేషం. అమ్మవారి గర్భగుడిని ఆలయ సిబ్బంది, అర్చకులు ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ ఆవరణలో దంపతులకు ప్రత్యేక హోమ కార్యక్రమాలను చేపట్టారు. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు సోమవారం అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు పచ్చవ వెంగయ్య, ముసలయ్య, పచ్చాపచ్చవ చిన్న వెంగయ్య, ఆలయ ఇఓ రాచగుంట వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. పోలీసు అధికారులు ఆలయ పరిధిలో గట్టి నిఘా ఏర్పాటు చేశారు.