ప్రకాశం

మినీస్టేడియం నిర్మాణానికి భూమిపూజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,జూన్ 12:జిల్లాకేంద్రమైన ఒంగోలులో అన్ని హంగులతో కూడిన మినీస్టేడియం నిర్మాణానికి చుట్టినట్లు ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ వెల్లడించారు. సోమవారం ఉదయం మినిస్టేడియం నిర్మాణానికి కలెక్టర్ వినయ్‌చంద్, దామచర్ల భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా దామచర్ల విలేఖర్లతో మాట్లాడుతూ క్రీడాప్రాంగణాన్ని పూర్తిస్థాయిలో నిర్మాణం చేపట్టి భవిష్యత్తులో అందరికి ఉపయోగపడేలా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈక్రీడాప్రాంగణం ఐదుఎకరాల 50సెంట్లల్లో నిర్మించనున్నట్లు చెప్పారు. రెండుకోట్ల 40లక్షలతో మినిస్టేడియం నిర్మాణానికి రాష్ట్రప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. దివంగత ఆనంద్‌గ్రానైట్ అధినేత పి ఆనంద్ గతంలో మినిస్టేడియం నిర్మాణానికి ఒకకోటిరూపాయలను అందచేశారని అందులో 40లక్షల రూపాయలను గతంలోనే నిర్మాణానికి ఖర్చు చేయటం జరిగిందన్నారు. మొత్తంప్రాజెక్టు ఖర్చు రెండుకోట్ల 80లక్షలు అవుతుందని తెలిపారు. మినిస్టేడియంకు ఆనంద్ మినీస్టేడియంగా నామకరణం చేసినట్లు చెప్పారు. మినీస్టేడియంలో ఇండోర్, అవుట్‌డోర్ స్టేడియంలు ఉంటాని బాలికలకు ప్రత్యేకంగా వసతి ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు. ఇండోర్ స్టేడియంలో బాడ్మింటన్, చెస్, క్యారమ్స్, టేబుల్ టెన్నిస్ , స్నూకర్ వంటిని ఉంటాయని ఔట్‌డోర్‌లో బాస్కెట్‌బాల్, టెన్నిస్, కబాడి, ఖోఖో, క్రికెట్ ప్రాక్టిస్, వాకింగ్ ట్రాక్‌లు ఉంటాయన్నారు మినిస్టేడియం నిర్మాణాన్ని ఐదునెలల్లోపు పూర్తిచేసి ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభించే ఏర్పాటుచేస్తామన్నారు. భూమిపూజలో పాల్గొన్న పిశ్రీ్ధర్ ఆనంద్ మాట్లాడుతూ మినిస్టేడియం ప్రాజెక్టు నిర్మాణం గతంలో అనివార్యకారణాల వలన నిలిచిపోయిందని త్వరితగతిన పూర్తయ్యేలా చూసి అందరికి అందుబాటులో తీసుకురావటం జరుగుతుందన్నారు. ఈ భూమిపూజ కార్యక్రమంలో గృహనిర్మాణ శాఖ పిడి శ్రీనివాసరావు, ఒంగోలు రెవిన్యూడివిజనల్ అధికారి కె శ్రీనివాసరావు, స్పోర్ట్స్ అధారిటి అధికారి ఆర్ యతిరాజ్, గృహనిర్మాణ శాఖ డిఇ దాసరి శర్మ ఇఇ టి వేణుగోపాల్ పాల్గొన్నారు.