ఆంధ్రప్రదేశ్‌

ప్రజాపంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 14: పేదలకు అందిస్తున్న సబ్సిడీల్లో విధిస్తున్న కోతలో భాగంగా తాజాగా ప్రజాపంపిణీ వ్యవస్థలో అవినీతి, అక్రమాలు, రవాణా చార్జీల భారం పేరిట రేషన్ డిపోలు ఎత్తివేయకుండా ప్రజాపంపిణీ వ్యవస్థను మరింతగా బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును బుధవారం కలిసిన సిపిఐ నాయకుల బృందం కోరింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ నాయకత్వంలో కలిసిన బృందంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, కార్యదర్శివర్గ సభ్యుడు జల్లి విల్సన్, పి హరనాథరెడ్డి పాల్గొన్నారు. రేషన్ డిపోల్లో అవినీతి రహిత విధానం పేరుతో బయోమెట్రిక్, ఐరిస్ విధానం ప్రవేశపెట్టి వేలిముద్ర పడలేదు, కళ్లు కనబడలేదనే సాకుతో ప్రజలకు రేషన్ సరుకులు కుదిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. ఈ విధానాలతో ప్రమేయం లేకుండా అర్హులైన పేదలందరికీ నిత్యావసర సరుకులను సరఫరా చేయాలని కోరారు.