ఆంధ్రప్రదేశ్‌

ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 15: భూ కబ్జా, మోసం, ఫోర్జరీ వంటి వివిధ కేసుల్లో అరెస్టయి హైదరాబాద్ చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అనంతపురం జిల్లా టిడిపి ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. దీనితో అరెస్టయిన దీపక్‌రెడ్డిని ఇప్పటివరకూ ఎందుకు సస్పెండ్ చేయలేదంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలకు బాబు తెరదించినట్టయింది. గురువారం తన నివాసంలో జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో ఉన్న వారు ఎలాంటి అక్రమాలకు పాల్పడినా సహించేది లేదని, వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమని బాబు స్పష్టం చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటూ జైలుకు వెళ్లిన వారిని తర్వాత కోర్టులు నిర్దోషులుగా తీర్పు ఇస్తే పార్టీలోకి తీసుకోవచ్చన్నారు. కాగా, ఈ విధంగా కేసుల్లో ఉన్న నెల్లూరు జిల్లా పార్టీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలో ఎంపి జెసి దివాకర్‌రెడ్డి మేనల్లుడైన దీపక్‌రెడ్డి కూడా చేరారు.