భక్తి కథలు

స్వామియే శరణం అయ్యప్పా! - 63

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మా నాయకులే మాకు ఆదర్శం! మేమూ అయ్యప్ప స్వామిని ఆరాధించి ఆ స్వామిని దర్శించడానికి దీక్షాధారులమై వస్తాము! మా నాయకులకు కూడా ఎప్పటికి గుర్తు వుండేలా గుడులు నిర్మించి పూజించుకుంటాము!’’ అన్నారు వావర్ అనుచరులు ఆవేశంగా!
‘‘అవును! మంచి ఆలోచన! ఆలాగే చేద్దాము!’’ అన్నారు పంబల, పాండ్య రాజులు. అందరూ అయ్యప్పస్వమి విగ్రహానికి మరొకసారి నమస్కరించి, స్వామి రూపాన్ని మనస్సులో నిలుపుకుని తిరుగు ప్రయాణమైనారు! ఆలయానికి కొద్ది దూరంలో అయ్యప్ప చెప్పగా ఆయుధాలు వుంచిన అశ్వత్థ వృక్షాన్ని సమీపించారందరూ!
‘‘తంత్రి స్వాములారా! మీరు ప్రతిరోజూ అయ్యప్ప విగ్రహన్నా పూజార్చనలతో సేవించే భాగ్యాన్ని పొంది ధన్యులైనారు! స్వామి సైనికులను ఈ అశ్వత్థ వృక్షం దగ్గర ఆయుధాలు వుంచమనడంతో కారణమేమైనా వుంటే తెలుపవలసిందిగా ప్రార్థిస్తున్మా’’ అడిగాడు పంబలరాజు అంతవరకు తమను వీడ్కొలుపడానికి వచ్చిన పూజారులనుద్దేశించి!
‘‘మహారాజా! ఆయుధాలను రజోగుణం గలవారు ఇతరులకు హాని కలిగించటానికి వాడుతారు! అటువంటివాటికి తన దగ్గర స్థానం లేదనీ, వాటిని విడిచి తననే నమ్మి తన సన్నిధికి రావలసి వుంటుందని తెలియచెప్పారు. అయ్యప్పస్వామి! అంతేగాక అశ్వత్థ వృక్షం మహావివిష్వు ప్రతిరూపంగా చెప్పబడింది! అందుచేత ఆ వృక్ష సమీపంలో విడివడటంవల్ల ఆయుధాలు పవిత్రతను పొంది ఇతరుల రక్షణ కల్పించడానికి ఉపయోగపడుతాయి! అశ్వత్థ వృక్షం యొక్క మహిమ గూర్చి బ్రహ్మాండ పురాణంలో వివరంగా తెలుపబడింది! ఆ విషయాలు చెబుతాము! వినండి!’’ అంటూ చెప్పసాగారు పూజారులు!
అశ్వత్థ వృక్ష మహిమ
అశ్వత్థ వృక్షం (రావిచెట్టు) పరమ పవిత్రమైనది! మహావిష్ణువు దాల్చిన వృక్ష రూపం! త్రిమూర్తులకు సంకేతం అశ్వత్థ వృక్షం! ఈ వృక్షం మూలంలో బ్రహ్మ, మధ్యలో మహావిష్ణువు, పైభాగంలో పరమేశ్వరుడు వుంటారు! త్రిమూర్తులు వృక్షం యొక్క ఉత్తర, దక్షిణ, పడమర దిక్కులలోని కొమ్మలలోనూ, ఇంద్రాది దేవతలు తూర్పు దిక్కున వుండే కొమ్మలలోనూ వుంటారు! సప్త సముద్రాలు, పుణ్యనదులు కూడా తూర్పు వైపు కొమ్మలలోనే వుంటాయి! చెట్టుమూలంలో వేర్లలో మహర్షులు, గోబ్రాహ్మణులు, నాలుగు వేదాలు వుంటాయి! ఇంతేగాక వృక్షమూలంలో ‘అ’కారము, కాండలో ‘ఉ’కారము, ఆకులు పండ్లలో ‘మ’కారము లీనమై వుండి ప్రణవ స్వరూపం (ఓం)గా కూడా చెప్పబడింది! అశ్వత్థ వృక్షం అందుకే అత్యంత మహిమాన్వితమైన వృక్షరాజంగా పూజింపబడుతున్నది!
అశ్వత్థ వృక్షమూలంలో శుభ్రమైన నీటి ని పోసి, ప్రదక్షిణ నమస్కారాలు మూడుసార్లు చేయాలి! ‘అశ్వత్థ నారాయణ నమః’ అని ధ్యానిస్తూ పాలను మూలంలో పోసి, పసుపు, కుంకుమలు అర్చించాలి! ప్రతి శనివారం ఈ విధంగా పూజించి, చెట్టును తాకి కళ్లకద్దుకోవాలి! మృత్యుంజయ మంత్రం పఠించడంవల్ల అపమృత్యుభయం తొలగిపోతుంది! ఆపదలు, ప్రమాదాలు పరిహరింపబడుతాయి!
మృత్యుంజయ మంత్రం
‘‘త్య్రయంబకం యజామహే
సుగంధిం పుష్టివర్థనమ్
ఉర్వారుకమివ బంధనాత్
మృత్యోర్ముక్షీయ మామృతాత్’’
సంతాన భాగ్యం కోరేవారు ఆ సంకల్పం చేసుకుని అశ్వత్థ వృక్షాన్ని పూజించి ప్రదక్షిణ నమస్కారాలు (పదకొండుసార్లు) చేయడంవల్ల కోరిక సిద్ధిస్తుంది! అశ్వత్థ వృక్షం మూలంలో దారిద్య్రానికి అధిదేవతయైన జ్యేష్ఠా దేవి కూడా వసిస్తూ వుంటుందని పురాణాలలో తెలుపబడింది! ఇందుకు సంబంధించిన కథనం వివరణ:
జ్యేష్ఠాదేవి పాల సముద్రునికి మహాలక్ష్మికి పూర్వమే జన్మించింది! ఈమెను శనీశ్వరుడు వివాహం చేసకున్నాడు! జ్యేష్ఠాదేవి చూపు సోకితే కష్టాలు, దారిద్య్రం సంభవిస్తాయి. శని వక్రదృష్టి సోకినా కష్టాల పరంపర, అనారోగ్యం, ఆపదలు సంభవిస్తాయి! మానవులు శని భగవానుని తైలాభిషేకాలతో, పూజార్చనలతో సేవించసాగారు వక్రదృష్టిని ప్రసరించవద్దని ప్రార్థిస్తూ!
జ్యేష్ఠాదేవికి ప్రత్యేక పూజార్చనలు చెప్పబడలేదు! ఆమె విచారంతో తన సోదరి మహాలక్ష్మిని, ఆమె భర్త మహావిష్ణువును దర్శించి తనకు కూడా పూజార్చనలు లభించేలా వరం ప్రసాదించమని కోరింది! మహాలక్ష్మి కూడా ఆమె కోర్కెను తీర్చమని భర్తను ప్రార్థించటంతో మహావిష్ణువు జ్యేష్ఠాదేవికి తన రూపమైన అశ్వత్థవృక్ష మూలంలో కూర్చుని వుండమనీ, శనివారాలు ఆ మూలంలో అర్పించే పూజాదికాలు ఆమెకూ చెందుతాయనీ, అందువల్ల శనీశ్వరుని అనుగ్రహం భక్తులకు లభిస్తుందనీ వరం ప్రసాదిస్తాడు! ఆ కారణగా అశ్వత్థ వృక్ష మూలంలో జ్యేష్ఠాదేవి కూడా వున్నా ఏ విధమైన అశుభాలు జరగవని మహావిష్ణువు సెలవివ్వడంతో ఆందోళన దూరమైంది భక్తులకు!
-ఇంకాఉంది

-డా. టి. కళ్యాణీసచ్చిదానందం