ఫోకస్

అధిక ఫీజులతో అల్లాడుతున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉన్నత చదువులు పక్కన పెడితే.. పేద, మధ్య తరగతి కుటుంబీకులు అధిక ఫీజులు చెల్లించలేక అల్లాడుతున్నారు. విదేశాల్లో ఒక విద్యార్థి చదువు మొదలుకొని ఉపాధి వరకు ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది. ఉచిత చదువుతోపాటు వౌలిక వసతుల కల్పనకు అయ్యే ఖర్చులన్నీ అక్కడి ప్రభుత్వాలే భరిస్తాయి. సంపూర్ణ అక్షరాస్యత సాధించే దిశగా పావులు కదుపుతోన్న తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉచిత విద్యపై ఎందుకు దృష్టి సారించడం లేదు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అంటూ ప్రచారం చేసింది. కానీ అమలులో ఘోరంగా విఫలమైంది. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసమే రెండున్నరేళ్లపాటు నాన్చుడు ధోరణి అవలంబించిన తెలంగాణ ప్రభుత్వం, ఇప్పుడు అధిక ఫీజులను కట్టడి చేయలేకపోతోంది. సగటు మనిషి సంపాదన ఇంటి అద్దె..స్కూల్ ఫీజుకు సరిపోతుంది. ఇక తామేమి తినాలి..ఎలా బతకాలి అనే వేదన ప్రతినిత్యం పేద, మధ్యతరగతి కుటుంబీకుల్లో వ్యక్తమవుతుంది. కనీస చదువు..పదోతరగతి వరకైనా చదివించుకుందామనే తపనతో ఉన్న తల్లిదండ్రుల్లో అధిక ఫీజులు చదువుపై అనాసక్తిని పెంచుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగానే ఉన్నాయి. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో అందరికీ అడ్మిషన్లు దొరకవు. దీంతో ప్రైవేటు పాఠశాలలను ఆశ్రయించాల్సి వస్తుంది. కాబట్టి ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ జరగాలి. లేదా..ఉచిత విద్య, ఉపాధి అవకాశం కల్పించే బాధ్యతను ప్రభుత్వాలు తీసుకోవాలి.
-జగన్‌మోహన్ మెట్ల
లోక్‌సత్తా తెలంగాణ రాష్ట్ర కన్వీనర్