కాలేజీ రోజుల్లో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీలత సినీ క్రియేషన్స్ పతాకంపై నూతన నటీనటులతో తెరకెక్కిస్తున్న ‘కాలేజ్ డేస్’ షూటింగ్ బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత శివకుమార్ క్లాప్ కొట్టగా, తెలంగాణ రాష్ట్ర మంత్రి మహేందర్ రెడ్డి స్క్రిప్ట్‌ను అందించారు. శివరాజ్‌పాటిల్ కెమెరా స్విచ్చాన్ చేశారు. అనంతరం నిర్మాత శ్రీలత వివరాలు తెలియజేస్తూ- ‘రెండు తెలుగు రాష్ట్రాల బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్న చిత్రమిది. హ్యాపీడేస్ తరహాలో అన్ని హంగులతో రూపొందిస్తున్నాం’ అన్నారు. దర్శకుడు రజనీకాంత్ ఎన్నా మాట్లాడుతూ- ‘దర్శకుడు క్రిష్ దగ్గర కొన్ని సీరియల్స్‌కు అసోసియేట్‌గా పనిచేశాను. ఇది నా మొదటి చిత్రం. కాలేజీ లవ్‌స్టోరీ అనగానే ప్రేమకథనే అనుకుంటారు. రెండు తెలుగు రాష్ట్రాలను మిళతం చేస్తూ చక్కని సందేశాత్మకంగా తెరకెక్కించనున్నాం. జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. సింగిల్ షెడ్యూల్‌లో చిత్రీకరణ పూర్తిచేసి డిసెంబర్‌లో విడుదల చేస్తాం’ అన్నారు. మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆదరించి మంచి విజయాన్ని అందించాలని అన్నారు. ఈ చిత్రానికి కెమెరా:ఎ.కె.ఆనంద్, ఫైట్స్:నందు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పి.ఈశ్వర్‌రావు, దర్శకత్వం:రజనీకాంత్ ఎన్నా.