ఇంటికో జవాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయిధరమ్ తేజ్, మెహరీన్ ఫిర్జాదా జంటగా బి.వి.ఎస్.రవి దర్శకత్వంలో దిల్ రాజు సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ నిర్మిస్తున్న చిత్రం 3జవాన్2. దీనికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను బుధవారం విడుదల చేసిన సందర్భంగా దర్శకుడు బి.వి.ఎస్.రవి మాట్లాడుతూ- 3మంచి కానె్సప్టుతో తెరకెక్కుతున్న చిత్రమిది. దేశానికి జవాన్ ఎంత అవసరమో ప్రతి ఇంటికీ జవాన్ లాంటి యువకుడు కావాలని చెప్పేదే ఈ చిత్రం. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఓ యువకుడికి ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? తన మనోధైర్యంతో కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అన్నదే కథ. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన ఎంటర్‌టైనింగ్ కమర్షియల్ సినిమా ఇది. తమన్ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడు. ఈ ఫస్ట్‌లుక్ అందరినీ ఆకట్టుకుంటుందన్న నమ్మకం ఉంది2 అన్నారు. నిర్మాత మాట్లాడుతూ- 3దర్శకుడు చెప్పిన కథ సాయిధరమ్‌కు చక్కగా కుదిరింది. ఈ నెల 23 నుంచి హైదరాబాద్‌లో యాక్షన్ పార్ట్ చిత్రీకరించాం. మిగతా షూటిం గ్ జూలైలో పూర్తిచేసి ఆగస్టులో చిత్రాన్ని విడుదల చేస్తాం2 అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా:కె.వి.గుహన్, ఎడిటింగ్:ఎస్.ఆర్.శేఖర్, నిర్మాత:కృష్ణ, దర్శకత్వం:బి.వి.ఎస్.రవి.