ఆసక్తి కలిగించే నైజాం సర్కరోడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్ధార్థ్ జాదవ్ హీరోగా రత్నం దావేజి సమర్పణలో రాజ్‌దుర్గే దర్శకత్వంలో రాజవౌళి నిర్మించిన చిత్రం ‘నైజాం సర్కరోడా’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం 23న విడుదలవుతున్న సందర్భంగా నిర్మాత రాజవౌళి వివరాలు తెలియజేస్తూ- ‘దక్షిణ భారత్‌లో రజాకార్ల దారుణాలకు అడ్డుకట్ట వేస్తూ తెలంగాణ ఉద్యమానికి ఊపిరినిచ్చిన అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. నైజాం పాలనలో మరట్వాడా, తెలంగాణ ప్రాంతాల్లో రజాకారుల ఆగడాలు మామూలుగా ఉండేవి కావు. వారి దారుణాల వల్ల తల్లిని, ఊరి ప్రజల్ని పోగొట్టుకున్న ఓ సాధారణ యువకుడు రజాకార్లను ఎదిరించి ఎలా తన ఊరిని, ప్రజలను కాపాడుకున్నాడనే ఆసక్తికర అంశంతో తెరకెక్కించాం. దేశ చరిత్రలో ఇదే చివరి విముక్తి పోరాటంగా చరిత్రకెక్కింది.
ఇందులో నాలుగు పాటలున్నాయి. తెలంగాణ అంతటా భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. 1992 నుంచి సినీ రంగంలో పలు చిత్రాలకు సహనిర్మాతగా పనిచేశాను. నిర్మాతగా నా తొలి చిత్రం ఇది. ఈ సినిమా తరువాత హీరో దర్శకుడితో మరో చిత్రాన్ని తీయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం తెలంగాణ పోరాట నేపథ్యంలో కమ్యూనిస్టు ఉద్యమం గురించి ఉంటుంది. నైజం సర్కరోడా చిత్రం ఆర్య సమాజం పోరాటం నేపథ్యంలో సాగింది’ అన్నారు.