14న శమంతకమణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారా రోహిత్, సుధీర్‌బాబు, సందీప్‌కిషన్, ఆది ముఖ్యపాత్రల్లో శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం 3శమంతకమణి2. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని జరుపుకుంటున్న సందర్భంగా నిర్మాత ఆనంద్ ప్రసాద్ వివరాలు తెలియజేస్తూ- 3బిజీగా వున్న యువ హీరోలతో మల్టీస్టారర్ చేయడం ఆనందంగా ఉంది. కథలో దమ్ము ఉన్నందుకే వాళ్లందరూ నటించేందుకు ఒప్పుకున్నారు. ఎవరూ ఊహించని మలుపులతో, థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కిన చిత్రమిది. పురాణాల్లో పాపులర్ అయిన శమంతకమణి గురించిన కథ కాదు ఇది. దాని గురించి తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే2 అన్నారు. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ- 3నారా రోహిత్ పవర్‌ఫుల్ పోలీసు అధికారిగా కన్పిస్తాడు. సుధీర్, ఆది, సందీప్‌ల పాత్రలు ఆకట్టుకుంటాయి. ఈ నాలుగు పాత్రల మధ్య జరిగిన ఎమోషనల్ డ్రామానే ఈ సినిమా. ఈ నాలుగు పాత్రలమధ్య ఎలాంటి రిలేషన్ ఉంటుంది? వారి మధ్య నడిచే సన్నివేశాలు ఆసక్తికరంగా, వినోదాత్మకంగా ఉంటాయి2 అన్నారు. చాందిని చౌదరి, జెన్నీ హనీ, అనన్య సోని, ఇంద్రజ, కస్తూరి, సుమన్, భరణి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.