మూడు భాషల్లో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్ హైదరాబాద్ పరిసరాల్లో వేసిన భారీ సెట్లో జరుగుతోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దసరాకు బదులు దీపావళికి విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళ భాషల్లో విడుదల చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా ఇది. ఇప్పటికే పవన్‌కళ్యాణ్‌కు తమిళనాడులో మంచి క్రేజ్ వుంది. మరోవైపు ఈమధ్య టాలీవుడ్ హీరోలందరూ తమిళ, మలయాళ మార్కెట్‌పై దృష్టి సారించి అక్కడ కూడా తమ సినిమాలతో పట్టు సాధించిన నేపథ్యంలో పవన్ కూడా అలాంటి ప్రయత్నమే చేస్తున్నాడని తెలిసింది. కీర్తి సురేష్, అను ఇమాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఈ షెడ్యూల్ ఈనెలాఖరువరకు జరుగుతుందట. త్వరలోనే సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తారట.