జాతీయ వార్తలు

లండన్ తరహాలో ఢిల్లీపై దాడికి కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 21: దేశ రాజధాని నగరం ఢిల్లీలో లండన్ తరహాలో ఉగ్రవాద దాడి జరిగే ప్రమాదం ఉందన్న నిఘా హెచ్చరికలతో దేశ వ్యాప్తంగా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఈద్‌కు ముందే ఈ దాడులు జరిపేందుకు ఎనిమిది మంది ఉగ్రవాదులు ఢిల్లీలోకి ప్రవేశించినట్టుగా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఢిల్లీతో పాటు దేశంలో ఇతర ప్రాంతాల్లోనూ దాడులకు అవకాశం ఉన్నందున భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. యునైటెడ్ కింగ్‌డంలోని మాంచెస్టర్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా అనేక చోట్ల ఉగ్రవాద దాడులు జరిగిన నేపథ్యంలో ఢిల్లీలోనూ ఆ తరహా దాడులకు ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నట్టుగా నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసు సీనియర్ అధికారి ఒకరు ధృవీకరించారు. బస్టు టెర్మినళ్లు, రైల్వే స్టేషన్లు, స్టార్ హోటళ్లు, మాల్స్, మార్కెట్లు, ప్రార్థనా స్థలాలు, పశ్చిమ దేశాలకు చెందిన దౌత్య కార్యాలయాలు..ఇలా అన్ని కీలక కేంద్రాల వద్ద నిరంతర అప్రమత్తతను కొనసాగించాలని దేశ వ్యాప్తంగా భద్రతా దళాలను హెచ్చరించినట్టు ఆ అధికారి వెల్లడించారు. అంతర్రాష్ట సరిహద్దుల్లో కూడా ఇదే స్థాయిలో భద్రతాపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని, అనుమానాస్పద వస్తువులు, వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టాలని కూడా భద్రతాదళాలకు స్పష్టం చేసినట్టు ఆయన తెలిపారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో విస్తృత స్థాయి దాడులు చేసేందుకు మిలిటెంట్లు కుట్ర పన్నుతున్నట్టుగా నిఘా వర్గాలకు స్పష్టమైన సంకేతాలు అందాయి. అయితే ఇందుకు సంబంధించి తదుపరి సంకేతాలేవీ వెల్లడికానప్పటికీ..మార్కెట్లు, జనసమ్మర్థంగా ఉండే స్థలాలు, ప్రార్థనా కేంద్రాలను లక్ష్యంగా చేసుకునే ఈ దాడులు జరిగే అవకాశం ఉందని మాత్రం నిఘా వర్గాలు తెలిపాయి.