జాతీయ వార్తలు

కర్ణన్‌కు నో బెయిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/ కోల్‌కతా, జూన్ 21: కోర్టు ధిక్కార నేరంపై అరెస్టయిన కోల్‌కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తి సిఎస్ కర్ణన్ మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు బుధవారం తిరస్కరించింది. అలాగే ఆయనకు విధించిన ఆరు నెలల జైలు శిక్షను నిలిపివేసేదీ లేదని స్పష్టం చేసింది. కర్ణన్ విషయంలో ఏడుగురు న్యాయమూర్తుల బెంచి ఇచ్చిన తీర్పు అమలు తమ బాధ్యత అని, ఇందులో ఎలాంటి మార్పులు చేయబోమని న్యాయమూర్తులు డివై చంద్రచూడ్,ఎస్‌కె కౌల్‌లతో కూడిన వెకేషన్ బెంచి విస్పష్టంగా తెలిపింది. సుప్రీం కోర్టు వారెంట్ తర్వాత నెల రోజులకు పైగా తప్పించుకు తిరిగిన కర్ణన్‌ను మంగళవారం కోయంబత్తూరులో పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కోర్టు వెకేషన్ పూర్తయ్యే వరకూ కర్ణన్‌కు బెయిల్ ఇవ్వాలని అడ్వకేట్ మాధ్యూస్ జె నెదుంపర వాదించారు. ఈ కేసులో పూర్తి స్థాయి తీర్పును ఏడుగురు సభ్యుల ధర్మాసం ఇంకా ఇవ్వలేదు కాబట్టి కర్ణన్‌కు బెయిల్ మంజూరు చేసి ఆయన శిక్షను నిలిపివేసే అధికారం వెకేషన్ బెంచ్‌కి ఉందని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా, కోయంబత్తూరులో అరెస్టయిన కర్ణన్‌ను బుధవారం ఎయిర్ ఇండియా విమానంలో చెన్నై నుంచి కోల్‌కతా తీసుకొచ్చి ప్రెసిడెన్సీ జైలుకు తరలించారు. విమానాశ్రయంలోనే కర్ణన్‌కు వైద్య పరీక్షలు పూర్తి చేసి నేరుగానే ప్రెసిడెన్సీ జైలుకు తీసుకొచ్చామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.