జాతీయ వార్తలు

3లక్షల మందితో యోగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, జూన్ 21: ఒకే రోజు.. ఒకే మైదానం.. మూడు లక్షల మంది ఏకకాలంలో యోగాసనాలు వేసి చరిత్ర సృష్టించారు. పతంజలి పీఠం అధినేత బాబా రాందేవ్ నేతృత్వంలో మూడో అంతర్జాతీయ యోగ దినోత్సవమైన బుధవారం ఈ అద్భుతం సాధ్యమైంది. అహ్మదాబాద్‌లోని జిఎండిసి మైదానంలో ఒకేసారి మూడు లక్షల మంది బాబా రాందేవ్ నేతృత్వంలో యోగాసనాలు వేసి గిన్నిస్ రికార్డును సృష్టించారు. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని, గుజరాత్ ముఖ్యమంత్రి నితిన్ పటేల్, మాజీ ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్, పలువురు రాజకీయ నాయకులు, ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు, హైకోర్టు న్యాయమూర్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మూడో అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా తెల్లవారుఝామునే కార్యక్రమం ప్రారంభమైంది. వివిధ మత విశ్వాసాలకు సంబంధించిన పెద్దలను ఈ భారీ కార్యక్రమాన్ని తిలకించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా, గుజరాత్ సిఎం రూపానీలు వేదికపైనే ఆసనాలు చేశారు. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ కార్యక్రమంలో మొత్తం మూడు లక్షల మందికి పైగా పాల్గొన్నారు. 2015 జూన్ 21న రాజ్‌పథ్‌లో ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో మొదటి అంతర్జాతీయ యోగ దినోత్సవం నాడు 35వేల 985మంది పాల్గొని సాధించిన రికార్డును గురువారం బాబా రాందేవ్ ఆధిగమించారు. ‘ఈ రోజు నాకు చాలా ముఖ్యమైన రోజు. ఒకేచోట మూడు లక్షల మంది యోగ నిర్వహించి ప్రపంచ రికార్డు సృష్టించటం అపూర్వం’ అని రాందేవ్ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో గిన్నిస్ బుక్ సంస్థ అధికారులు కూడా పాల్గొన్నారు. వాస్తవంగా ఎంతమంది పాల్గొన్నారనేది గిన్నిస్ బుక్ అధికారులు వెల్లడిస్తారని ఆయన అన్నారు. యోగకు విశ్వవ్యాప్తంగా ప్రాచుర్యం తెచ్చేందుకు 2011నుంచి భారత్ ప్రయత్నాలు చేసిందని, 2014లో మోదీజీ విజ్ఞప్తి మేరకు జూన్ 21న అంతర్జాతీయ యోగ దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటన చేయటంలో మోదీజీ విజయం సాధించారని అని రాందేవ్ పేర్కొన్నారు.
చిత్రం: అహ్మదాబాద్‌లో బాబా రాందేవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగ కార్యక్రమంలో పాల్గొన్న గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా