రాష్ట్రీయం

గవర్నర్‌కు ఐవై ఆర్ ఫిర్యాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 21: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, ఎపి బ్రాహ్మణ సంక్షేమ కార్పోరేషన్ మాజీ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు రాజ్‌భవన్‌లో బుధవారం గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. కృష్ణారావును ఎపి బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ పదవి నుండి మంగళవారం తప్పించిన తర్వాత సొషల్ మీడియాలో ఆయనను అవమానించే విధంగా అభ్యంతరకరమైన ఫోటోలను ఒకరు ‘పోస్ట్’ చేశారు. ఈ నేపథ్యంలో కృష్ణారావు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో మాట్లాడారు. తనపై సోషల్ మీడియాలో వచ్చిన ‘పోస్ట్’పై ఫిర్యాదు చేశారు.
ఇలా ఉండగా ఎపి బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్‌తో పాటు ఎపి దేవాదాయ అర్చకులు, ఉద్యోగుల సంక్షేమ ఫండ్ ట్రస్ట్ చైర్మన్ పదవుల నుండి తనను ప్రభుత్వం తప్పించిన అంశంపై గవర్నర్ నరసింహన్‌కు ఐవైఆర్ కృష్ణారావు వివరించినట్టు తెలిసింది. ఎపిలో బ్రాహ్మణులు, అర్చకులు తదితరుల సంక్షేమం, అభివృద్ధి కోసం గత ఏడాదిన్నరగా చేపట్టిన పథకాలు, కార్యక్రమాల గురించి వివరించినట్టు తెలిసింది. ఐఎఎస్ అధికారిగా గత మూడున్నర దశాబ్దాల నుండి ఎంత నీతిగా, న్యాయంగా పనిచేశారో అదేవిధంగా గత ఏడాదిన్నర నుండి పనిచేస్తున్నానని వివరించారని తెలిసింది. బ్రాహ్మణ సంక్షేమ కార్పోరేషన్ చైర్మన్‌గా పనిచేసినంత కాలం వేతనం కూడా తీసుకోకుండా, సామాజిక సేవగా భావించి పనిచేశానని వివరించినట్టు తెలిసింది.
భావస్వేచ్ఛ ప్రకటన ప్రతి పౌరుడికి ఉన్నట్టుగానే తాను కూడా కొన్ని అంశాలపై సోషల్ మీడియాలో స్పందించానని, అది తన వ్యక్తిగతమైన అంశమని గవర్నర్‌కు వివరించినట్టు తెలిసింది. సోషల్ మీడియాలో స్పందించడం వల్లనే తనను రెండు సంస్థల చైర్మన్ పదవుల నుండి తొలిగించారని భావించాల్సి వస్తోందన్నారు. ఎవరైనా స్వేచ్ఛగా జీవించాలనే భావిస్తుంటారని, అలాగే కొన్ని కీలకమైన విషయాల్లో తాను స్పందించానని గవర్నర్‌కు కృష్ణారావు వివరించినట్టు తెలిసింది.
కష్ణారావు చెప్పిన అంశాలన్నీ శ్రద్ధగా ఆలకించిన గవర్నర్ నరసింహన్ తాను సరైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్టు తెలిసింది.