ఆంధ్రప్రదేశ్‌

మైనార్టీలు మోదీ వెంటే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 21: మైనార్టీలు ప్రధాని నరేంద్ర మోదీ వెంటే ఉన్నారని భారతీయ జనతాపార్టీ మైనార్టీ మోర్చా జాతీయ అధ్యక్షుడు అబ్దుల్ రషీద్ అన్సారీ పేర్కొన్నారు. భారతీయ జనతాపార్టీ మైనార్టీ మోర్చా రాష్ట్ర శాఖ నిర్వహిస్తున్న ఇఫ్తార్ విందులో పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన అన్సారీ గాంధీనగర్‌లోని ఒక హోటల్లో బుధవారం విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ మైనార్టీలను అభివృద్ధి చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని మోదీ నిలుపుకున్నారన్నారు. ఈ మూడేళ్లలో పలు రకాల పథకాలు అమలు చేస్తూ వారి అభివృద్ధికి బాటలు వేస్తున్నారన్నారు. ముఖ్యంగా దేశంలో మత కలహాలు చెలరేగకుండా శాంతి వాతావరణం నెలకొనేలా చేశారన్నారు. ముస్లింలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరచి వారి జీవన ప్రమాణాల పెంపునకు కృషి చేస్తున్నారన్నారు. సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్ అనేది భాజాపా వైఖరి అని, భారత సమాజంలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్‌లు, జైనులు, సిక్కులు ఇలా అన్ని వర్గాలను కలుపుకుపోవాలనేది కేంద్ర ప్రభుత్వ భావన అన్నారు. ఈ వైఖరితోనే అన్ని పార్టీల కన్నా ఎక్కువగా ముస్లింలకు దగ్గరైందన్నారు. కశ్మీర్ వంటి ప్రాంతాల్లో అశాంతికి కారణాలను తొలగించి అవి లేకుండా చేయడం జరిగిందన్నారు. దాంతో ముస్లింలు శాంతియుత వాతావరణంలో జీవిస్తున్నారన్నారు. విదేశాల్లో ఉద్యోగాలు కోల్పోయిన వారిని తిరిగి సురక్షితంగా భారత్‌కు రప్పించే ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ముస్లింలు ఉన్నత స్థానంలో జీవించేలా జీవన ప్రమాణాలు పెంచే ఏర్పాట్లు చేశారన్నారు. భారతీయ జనతాపార్టీ బడ్జెట్‌లో మైనార్టీలకు కేటాయింపులు బాగా పెంచిందన్నారు. కాంగ్రెస్ కేటాయించిన నిధులను ఏ నాడూ ఖర్చుచేయకపోవడంతో అవి మురిగిపోయేవని తెలిపారు. భాజాపా కేటాయించిన నిధులను ప్రణాళిక ప్రకారం ఖర్చు చేయడంతో పాటు ప్రతి ఏడాది నిధులను పెంచుతూ వస్తోందని తెలిపారు. మైనార్టీలకు విద్య, ఉపాధి అవకాశాలు పెంచటానికి కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, విద్యార్థులకు ఉపకార వేతనాలు, వృత్తివిద్య అందించడం, విదేశీ విద్య చదివేందుకు తక్కువ వడ్డీతో రుణాలు, స్వయం ఉపాధిని అందించే లెర్న్ - ఎర్న్ పథకం, నైపుణ్యాభివృద్ధిని అందించే ఉస్తాద్ పథకం వంటివి అమలు చేస్తున్నారన్నారు. వీటన్నిటిలోను మహిళలకు 30 శాతం రిజర్వేషన్ ఉందన్నారు. మదర్సాలలో ఆధునిక విద్యను అందిస్తున్నారని, కాంగ్రెస్ హయాంలో మదర్సాల్లో కేవలం మత సంబంధిత కోర్సును అరబ్బీ మాధ్యమంలో మాత్రమే బోధించేవారని తెలిపారు. రిపబ్లిక్‌డే ఉత్సవాల్లో అబుదాబి యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ ఆలీని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం మోదీ చూపుతున్న దౌత్యరీతికి అద్దం పడుతోందని తెలిపారు. విలేఖర్ల సమావేశంలో మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజి, రాష్ట్ర కార్యదర్శి షేక్ మహబూబ్ ఆలీ, నగర మైనార్టీ మోర్చా అధ్యక్షుడు మీర్జ ఇంతియాజ్ ఆలీ, తదితరులు పాల్గొన్నారు.