తెలంగాణ

విత్తన కేంద్రాలపై దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 21: నకిలీ విత్తనాలు, నాణ్యతలేని విత్తనాలను నిలువచేస్తున్న వారిపై, డిస్ట్రిబ్యూటర్లు, డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. బుధవారం ఆయన ఇక్కడ వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి నకిలీ విత్తనాల విక్రయాలు, నివారణపై చర్చించారు. వ్యవసాయ, పోలీసు అధికారులతో కూడిన 10 టాస్క్ఫోర్స్ బృందాలు మంగళవారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న విత్తనోత్పత్తి సంస్థలపై దాడులు చేసిన సంఘటనలపై కూలంకషంగా చర్చించారు. భూత్పూరు, జడ్చర్ల, గద్వాల, దేవరకొండ, చింతపల్లి, వరంగల్, ఆదిలాబాద్, మహేశ్వరం, హయత్‌నగర్, సరూర్‌నగర్ తదితర ప్రాంతాల్లో ఉన్న విత్తన నిల్వ కేంద్రాలు, డిస్ట్రిబ్యూటర్లు, డీలర్లపై టాస్క్ఫోర్స్ బృందాలు బుధవారం దాడులు చేశాయి. మొత్తం 165 కేంద్రాలపై దాడులు జరిగాయి. 4.10 కోట్ల రూపాయల విలువైన పత్తితదితర పంటల విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులు కొనసాగాలని, తప్పు చేసిన వారిపై కఠినంగా వ్యవహరించాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి సి. పార్థసారథి, కమిషనర్ జగన్‌మోహన్, ఉద్యాన కమిషనర్ వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.