తెలంగాణ

పంటల బీమా చేయించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 21: తెలంగాణ రాష్టవ్య్రాప్తంగా రైతులు తాము వేసే పంటలకు బీమా చేయించాలని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన ఇక్కడ అధికారికంగా ప్రకటన విడుదల చేస్తూ, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం (పిఎంఎఫ్‌బివై) కింద వరి, జొన్న, మొక్కజొన్న, కంది, పెసలు, మినుములు, వేరుసెనగ, సోయాబీన్, పసుపు పంటలకు బీమా చేయించుకునే సౌకర్యం ఉందన్నారు. పంటలకు బీమా చేయిస్తే, రైతులు ధీమాగా ఉండవచ్చన్నారు. ప్రస్తుత ఖరీఫ్‌లో రైతులు రెండు శాతం ప్రీమియం చెల్లిస్తే సరిపోతుందని, రబీ పంటలకు కేవలం 1.5 శాతం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఉద్యాన పంటలకు మాత్రం ఐదు శాతం ప్రీమియం చెల్లించాల్సి ఉందని వివరించారు. వరికి ఆగస్టు 31 వరకు, ఇతర పంటలకు జూలై 31 వరకు బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని పోచారం వివరించారు. ఇలా ఉండగా వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కింద పత్తిపంటకు జూలై 15 వరకు, మిర్చికి జూలై 9 వరకు, పామాయిల్‌కు జూలై 14 వరకు, బత్తాయికి ఆగస్టు 9 వరకు బీమా చేయించుకునే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ అవకాశాన్ని రైతులు ఉపయోగించుకోవాలని మంత్రి కోరారు. పంటలకు బీమా చేయిస్తే ప్రకృతివైపరీత్యాల సందర్భంగా పంటలకు నష్టం జరిగితే రైతులకు బీమా డబ్బు చెల్లిస్తారని వెల్లడించారు.