తెలంగాణ

నిమ్స్‌లో మరో 90 పేయింగ్ గదులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 21: రాష్ట్ర రాజధానిలోని ప్రతిష్టాత్మకమైన నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్ (నిమ్స్) లో కొత్తగా నిర్మించిన పేయింగ్ రూమ్స్ భవనాన్ని వైద్యమంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి గురువారం ప్రారంభిస్తారు. మొత్తం ఆరుఫ్లోర్లతో నిర్మించ తలపెట్టిన ఈ భవనంలో తొలిదశలో మూడుఫ్లోర్లు పూర్తయ్యాయి.
ఒక్కో ఫ్లోర్‌లో 15 గదుల చొప్పున మూడు ఫ్లోర్లలో 45 గదులు నిర్మించారు. ఈ గదుల్లో సోలార్ ద్వారా వేడినీరు, ఎల్‌ఇడి లైట్లు, టివి, ఎసి, పేషెంట్ బెడ్‌తోపాటు అటెండెంట్‌కు బెడ్లు, బెడ్‌సైడ్ లాకర్లు, కుర్చీలు తదితర సౌకర్యాలను కల్పించారు.
పేషంట్స్‌తోపాటు వారి అటెండెంట్స్‌కు క్యాంటీన్ కూడా అందుబాటులో ఉంటుంది. తొలిదశలో నిర్మించిన 45 గదులు కాకుండా రెండోదశలో మరో మూడుఫ్లోర్లలో మరో 45 గదులు నిర్మిస్తామని నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ కె. మనోహర్ వెల్లడించారు. గురువారం జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉన్నతాధికారులు పాల్గొంటారని అధికార వర్గాలు వెల్లడించాయి.