జాతీయ వార్తలు

శశికళపై ‘ఫెరా’ ఉల్లంఘన అభియోగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జూన్ 21: అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి వికె శశికళపై ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు అభియోగాలను నమోదు చేసింది. అక్రమ ఆస్తుల కేసులో బెంగళూరు జైలులో ఉన్న శశికళపై ఫెరా చట్టాన్ని ఉల్లంఘించిన కేసులో చార్షిషీటు దాఖలయింది. జైలులో ఉన్న శశికళను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎ జకీర్ హుసేన్ విచారించారు. శశికళ బెంగళూరులోని పరపన్న అగ్రహారం జైలులో ఉన్నారు. జెజె టివి చానల్ వ్యవహారంలో ఫెరా నిబంధనలు ఉల్లంఘించారని ఆమెపై ఆరోపణలు. నిధులు అక్రమ మార్గాలద్వారా విదేశాలకు తరలించారని తెలిపారు. శశికళ, ఆమె బంధువు వి భాస్కరన్, జెజె టివికి సంబంధించి 1995, 1996కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అభియోగాలు నమోదు చేసింది. జైలు నుంచే శశికళను విచారించడానికి మే నెలలో కోర్టు అనుమతి ఇచ్చింది.