జాతీయ వార్తలు

మరణభిక్ష పెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జూన్ 21: భారత మాజీ ప్రథాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో నిందుతుడైన రాబర్ట్ పయాస్ కారుణ్య మరణంకోసం తమిళనాడు ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. గత 27 సంవత్సరాలుగా తాను జైలులోనే ఉన్నానని, తన జీవితమంతా వ్యర్థమైపోయిందని వాపోతూ ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు జైళ్ల డిజిపికి రాబర్ట్ లేఖ రాశాడు. ఈ 27 సంవత్సరాల కాలంలో తన కుటుంబ సభ్యులు ఎవరూ తనను చూడడానికి రాలేదని అలాంటప్పుడు తాను బతికి ఉండి ఏమి ప్రయోజనం అని అతడు పేర్కొన్నాడు. 1999లో తను దోషిగా ప్రకటించిన న్యాయమూర్తి కూడా ఎలాంటి నేరం చేయకపోయినా జైలులో ఉన్నాడని తన విషయంలో వ్యాఖ్యానించారని రాబర్ట్ గుర్తుచేశాడు. ప్రస్తుత పరిస్థితులను బట్టి తనను జైలునుంచి విడుదల చేసే అవకాశం లేదని అందుకే తనపట్ల కారుణ్యాన్ని కరబరిచి చంపేయాలని కోరాడు. శ్రీలంక తమిళుడైన రాబర్ట్ పయాస్ ఎల్‌టిటిఇ కమెండో బృందం సభ్యుడన్న ఆరోపణలున్నాయి. రాజీవ్‌గాంధీ హత్యకు కుట్రపన్నిన వారిలో తానూ ఒకడినని రాబర్ట్ గతంలోనే అంగీకరించాడు. 1991 మే 21 శ్రీపెరంబదూర్ ఎన్నికల సభలో రాజీవ్‌గాంధీ హత్య జరిగింది. ఆ హత్యకేసుకు సంబంధించి కోర్టు దోషులుగా ప్రకటించిన ఏడుగురిలో రాబర్ట్ ఒకడు.