ఆంధ్రప్రదేశ్‌

ఐవైఆర్‌కు ఉద్వాసన సరికాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 21: రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావును రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి తొలగించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య ఆధ్వర్యంలో బుధవారం గుంటూరు నగరంలోని శంకర్‌విలాస్ సెంటర్‌లో ధర్నా, రాస్తారోకో జరిపారు. ఈసందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముత్తనపల్లి శివకృష్ణప్రసాద్ మాట్లాడుతూ బ్రాహ్మణ కార్పొరేషన్, రాజధాని ఏర్పాటులోనూ ముఖ్యభూమిక పోషించిన ఐవైఆర్ కృష్ణారావును ప్రభుత్వం ముఖ్యమంత్రిపై సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు చేశారనే నెపంతో వివరణ కూడా కోరకుండా ఉద్వాసన పలకడం దురహంకారానికి నిదర్శనమన్నారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కూడా గ్రామాల్లో కరణాలు, మునసబులను తొలగించారని, బ్రాహ్మణులు రాజకీయంగా ఎదగడం తెలుగుదేశం పార్టీకి ఇష్టం లేదా? అని ప్రశ్నించారు. ఫేస్‌బుక్‌లో షేర్ చేసినందుకే పదవి నుండి తొలగిస్తే చంద్రబాబును బహిరంగంగా విమర్శించే ఆ పార్టీకే చెందిన మంత్రులు అయ్యన్నపాత్రుడు, ఎంపీలు కేశినేని నాని, జెసి దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావులపై ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాపు కార్పొరేషన్ చైర్మన్‌పై సదావర్తి భూముల కొనుగోలు వ్యవహారంలో చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ఐవైఆర్ స్థానంలో 13 జిల్లాల్లో పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తున్న బ్రాహ్మణులే దొరకలేదా? అని విమర్శించారు. తెలంగాణ పార్టీ కమిటీలో ఉండి, కుల సంఘం పేరుతో చందాలు వసూలు చేసి బ్రాహ్మణులను మోసం చేసి, పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి చైర్మన్ పదవి ఇవ్వడం సరికాదన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ అభివృద్ధి కోసం ఒక్క రూపాయి వేతనం కూడా తీసుకోకుండా ప్రభుత్వానికి, ఇటు బ్రాహ్మణుల సంక్షేమానికి శ్రమించిన ఐవైఆర్ కృష్ణారావుకు తక్షణమే క్షమాపణ చెప్పాలని శివకృష్ణప్రసాద్ డిమాండ్ చేశారు. ధర్నాలో బ్రాహ్మణ సంఘం నాయకులు కోనంకి మారుతి, ఎస్ శ్రీనివాసశాస్ర్తీ, కోట సుబ్రహ్మణ్యం, నందిరాజు పాండు, దండంరాజు, హనుమంతరావు, గాలి శ్రీనివాసరావు, సోమరాజు శ్రీనివాస్, ప్రకాష్, రామచంద్రరావు, నాగరాజు, ధన్వంతరి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.