ఆంధ్రప్రదేశ్‌

సబ్‌ప్లాన్‌పై నిర్లక్ష్యం వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 21: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల వినియోగంలో నిర్లక్ష్యం చూపొద్దని, ప్రభుత్వ పథకాలు సకాలంలో లబ్ధిదారులకు అందేలా చూడాలని సాంఘిక, సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనందబాబు స్పష్టం చేశారు. సచివాలయం మూడో బ్లాక్‌లోని తన కార్యాలయంలో 12 శాఖల అధికారులతో ఆయన బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. మూడేళ్లలో ప్రభుత్వం కేటాయించిన నిధులు, పనులు జరిగిన తీరును ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆనందబాబు మాట్లాడుతూ ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను సకాలంలో వినియోగించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పనుల నిర్వహణలో నిర్లక్ష్యం చూపొద్దన్నారు. గిరిజన, దళితుల సంక్షేమానికి ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తోందన్నారు. సంక్షేమ ఫలాలు లబ్ధిదారులకు చేరినప్పుడే ప్రభుత్వ ఆశయం నెరవేరుతుందన్నారు. భవిష్యత్తులో సబ్‌ప్లాన్ ఏరియాల్లో ఐటిడిఎ, పంచాయతీరాజ్, వైద్య, ఆరోగ్యం, విద్య పనితీరుకు సంబంధించి ప్రత్యేక సమావేశం త్వరలో ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎంతమేర నిధులు అవసరమవుతాయన్న దానిపై ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకుని వచ్చే సమీక్షా సమావేశానికి హాజరుకావాలన్నారు.