ఆంధ్రప్రదేశ్‌

బదిలీల జీవోలకు వ్యతిరేకంగా ఉద్యమించిన ఉపాధ్యాయులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 21: ఉపాధ్యాయుల బదిలీలలో వెబ్ కౌనె్సలింగ్ విధానాన్ని రద్దు చేయాలని, ప్రతిభ ఆధారిత పాయింట్లను తీసివేయాలని, పాఠశాలల మూసివేతను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఫ్యాప్టో, జాక్టో పిలుపు మేరకు బుధవారం రాష్టవ్య్రాప్తంగా 13 జిల్లాల డిఇఓ కార్యాలయాలను వేలాది మంది ఉపాధ్యాయులు దిగ్బంధనం చేశారు. విద్యాశాఖ మంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయాలని, విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరి విడనాడాలని నినాదాలతో హోరెత్తించారు. వివిధ జిల్లాల్లో 2000 నుండి 5000 మంది ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో 2500 మందికి పైగా జిల్లాలోని ఉపాధ్యాయులు ఉదయం 9 గంటలకే జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయానికి చేరుకొని పెద్దపెట్టున నినాదాలు చేశారు. డిఇవో కార్యాలయంలోనికి చొచ్చుకొని పోవడానికి ప్రయత్నించగా పోలీసులు లాఠీఛార్జి చేసి చెల్లాచెదురు చేశారు. అనంతరం ఉపాధ్యాయ సంఘాల నాయకులను, 500 మందికి పైగా ఉపాధ్యాయులను, 200 మంది మహిళా ఉపాధ్యాయులను అరెస్టు చేసి చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కృష్ణా, గుంటూరు, విశాఖ, చిత్తూరు , పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు. ఆయా జిల్లాల్లో పాల్గొన్న నాయకులు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వెంటనే సమస్యలను పరిష్కరించకుంటే ‘చలో అమరావతి’ చేపడతామని ప్రకటించారు.