బిజినెస్

గుంటూరు స్పైసెస్ పార్కులో మిర్చి, పసుపు ప్రాసెసింగ్ యూనిట్ల్ఘు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 21: గుంటూరు జిల్లాలోని స్పైసెస్ పార్కులో 26 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 4 యూనిట్లతో కూడిన మిర్చి, పసుపు ప్రాసెసింగ్, కోల్డ్ స్టోరేజ్‌ల నిర్మాణానికి ఎపి స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ బోర్డు ఆమోదం తెలిపింది. చైర్మన్ ఎల్‌విఎస్‌ఆర్‌కె ప్రసాద్ అధ్యక్షతన కార్పొరేషన్ 191వ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశం విజయవాడలో బుధవారం జరిగింది. ఈ సమావేశంలో మేనేజింగ్ డైరెక్టర్ కెవి రమణ, డైరెక్టర్లు పాల్గొన్నారు. కార్పొరేషన్ ఆఫీస్‌ను హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించడాన్ని కూడా బోర్డు సమావేశం ఆమోదించింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్‌ల మధ్య ఆస్తుల విభజన, ఉద్యోగుల విభజనకు బోర్డు ఆమోదం తెలిపింది. త్వరలో మరో 4 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాముల నిర్మాణానికి వెంటనే చర్యలు చేపట్టాలని బోర్డు నిర్ణయించింది