బిజినెస్

కోలుకోని స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో సూచీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 21: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన ప్రతికూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం కూడా నష్టాలకే పరిమితమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 13.89 పాయింట్లు కోల్పోయి 31,283.64 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 19.90 పాయింట్లు దిగజారి 9,633.60 వద్ద నిలిచింది. మంగళవారం కూడా సూచీలు స్వల్పంగా నష్టపోయాయి. కాగా, విమానయాన ఇంధనం ధరలు తగ్గుముఖం పట్టనున్నాయన్న అంచనాల మధ్య ఎయిర్‌లైన్స్ సంస్థల షేర్లు మదుపరులను ఆకట్టుకున్నాయి. స్పైస్‌జెట్, జెట్ ఎయిర్‌వేస్ షేర్ల విలువ 4.03 శాతం, 2.99 శాతం మేర పెరిగాయి. ఇండిగో షేర్ విలువ కూడా 1.51 శాతం పుంజుకుంది.