బిజినెస్

ఈసారి జిడిపి 7.6 శాతం: ఎన్‌సిఎఇఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 21: ఈసారి సాధారణ వర్షపాతం నమోదవుతుందన్న అంచనాల మధ్య భారత జిడిపి వృద్ధిరేటు ఈ ఆర్థిక సంవత్సరం (2017-18)లో 7.6 శాతంగా ఉండొచ్చని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రిసెర్చ్ (ఎన్‌సిఎఇఆర్) చెప్పింది. ఇంతకుముందు 7.3 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతుండటంతో జిడిపి కూడా పెరుగుతుందని ఎన్‌సిఎఇఆర్ అభిప్రాయపడింది. కాగా, గత ఆర్థిక సంవత్సరం (2016-17)లో దేశ జిడిపి వృద్ధిరేటు 7.1 శాతానికి పడిపోయినది తెలిసిందే. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16)లో ఇది 7.6 శాతంగా ఉంది. ఇదిలావుంటే ప్రపంచ బ్యాంక్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ జిడిపి వృద్ధిరేటు 7.2 శాతంగా ఉండొచ్చని అంచనా వేసినది తెలిసిందే.