క్రీడాభూమి

గవాస్కర్ జట్టు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెస్టిండీస్‌లో భారత జట్టు అంటే ముందుగా గుర్తుకొచ్చే పేరు సునీల్ గవాస్కర్. ‘లిటిల్ మాస్టర్’ గవాస్కర్ అంటే విండీస్ క్రికెట్ అభిమానులకు వల్లమాలిన అభిమానం. భారత జట్టును గవాస్కర్ జట్టుగా పిలిచేవారంటే, అతనిని వారు ఎంతగా ఆరాధించేవారో స్పష్టమవుతుంది. విండీస్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మన్ గవాస్కరే కావడం విశేషం. అతను 27 మ్యాచ్‌ల్లో 46 ఇన్నింగ్స్ ఆడి, 2,749 పరుగులు చేశాడు. వెస్టిండీస్ తరఫున భారత్‌పై క్లైవ్ లాయిడ్ 28 టెస్టుల్లో 44 ఇన్నింగ్స్ ఆడి 2,344 పరుగులు సాధించాడు. గవాస్కర్‌కు 236 (నాటౌట్), లాయిడ్‌కు 242 (నాటౌట్) అత్యధిక స్కోర్లు. 1,000 లేదా అంతకు మించి పరుగు చేసిన వారిలో శివనారైన్ చందర్‌పాల్ (2,171), రాహుల్ ద్రవిడ్ (1,978), గారీ సోబర్స్ (1,920), వివిఎస్ లక్ష్మణ్ (1,715), రోహన్ కన్హాయ్ (1,693), గార్డెన్ గ్రీనిడ్జ్ (1,678), సచిన్ తెండూల్కర్ (1,630), దిలీప్ వెంగ్‌సర్కార్ (1,596), వీక్స్ (1,495), గుండప్ప విశ్వనాథ్ (1,455), పాలీ ఉమ్రీగర్ (1,395), కార్ల్ హూపర్ (1,357), అల్విన్ కాళీచరణ్ (1,229), కపిల్ దేవ్ (1,079), మహీందర్ అమర్‌నాథ్ (1,076), అంశుమాన్ గైక్వాడ్ (1,032), బ్రియాన్ లారా (1,002) ఉన్నారు. వనే్డ ఇంటర్నేషనల్స్‌లో సచిన్ అత్యధికంగా 39 మ్యాచ్‌ల్లో 1,573, డెస్మండ్ హేన్స్ 36 మ్యాచ్‌ల్లో 1,357 చొప్పున పరుగులు సాధించారు. మొత్తం మీద ఇరు జట్ల మధ్య జరిగిన వనే్డల్లో 1,000కి మించి పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో రాహుల్ ద్రవిడ్ (1,348), శివనారైన్ చందర్‌పాల్ (1,319), రాంనారైన్ శర్వాణ్ (1,296), కార్ల్ హూపర్ (1,279), క్రిస్ గేల్ (1,220), గార్డెన్ గ్రీనిడ్జ్ (1,181), సౌరవ్ గంగూలీ (1,142), బ్రియాన్ లారా (1,142) స్థానం సంపాదించుకున్నారు. టి-20 ఫార్మెట్‌లో గేల్ అత్యధికంగా 154 (మూడు మ్యాచ్‌లు), రోహిత్ శర్మ 98 (నాలుగు మ్యాచ్‌లు) చొప్పున పరుగులు సాధించారు. నిజానికి, గవాస్కర్ తర్వాత ఆ స్థాయలో విండీస్‌లోని క్రికెటర్ అభిమానులను ఆకట్టుకున్న భారత ఆటగాడు లేనడంలో సందేహం లేదు. నాడు గవాస్కర్ మాదిరిగా ఇప్పుడు కోహ్లీ అక్కడ భారీగా అభిమానులను సంపాదిం చుకుంటాడో లేదో చూడాలి.