క్రీడాభూమి

సైనా, సింధు శుభారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, జూన్ 21: భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పివి సింధు ఇక్కడ ప్రారంభమైన ఆస్ట్రేలియా ఓపెన్ బాడ్మింటన్ సూపర్ సిరీస్ మహిళల సింగిల్స్ విభాగంలో శుభారంభం చేశారు. మొదటి రౌండ్‌లో సైనా కొరియాకు చెందిన సంగ్ జీ హ్యున్‌ను 21-10, 21-16 తేడాతో ఓడించి, రెండో రౌండ్ చేరింది. సింధు 21017, 14-21, 21-18 ఆధిక్యంతో జపాన్ క్రీడాకారిణి సయాకా సాటోపై విజయం సాధించింది. అయితే, రుత్విక శివానీ గద్దె మొదటి రౌండ్‌లోనే ఓటమిపాలైంది. ఆమెపై చైనాకు చెందిన చెన్ జియావోజిన్ 21-17, 14-21, 21-12 తేడాతో గెలుపొందింది. కాగా, పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్ రెండో రౌండ్ చేరుకోగా, అజయ్ జయరామ్, పారుపల్లి కశ్యప్, సిరిల్ వర్మ, హెచ్‌ఎస్ ప్రణయ్ మొదటి రౌండ్లలోనే పరాజయాలను ఎదుర్కొని నిష్క్రమించారు. శ్రీకాంత్ 21-13, 21-16 స్కోరుతో చైనీస్ తైపీ ఆటగాడు కాన్ జవో యూను ఓడించాడు. మరో మ్యాచ్‌లో సాయి ప్రణీత్ 10-21, 21-12, 21-10 స్కోరుతో ఇండోనేషియాకు చెందిన టామీ సుగియార్తోపై గెలుపొంది సంచలనం సృష్టించాడు. అయితే, అజయ్ జయరామ్ 21-14, 10-21, 9-21 తేడాతో ఇంగ్ కాలాంగ్ అంగస్ (హాంకాంగ్) చేతిలో ఓటమిపాలై అభిమానులను నిరాశ పరిచాడు. కశ్యప్ కూడా అతని మార్గానే్న అనుసరించాడు. సన్ వాన్ హో (కొరియా) 21-18, 14-21, 21-15 తేడాతో కశ్యప్‌ను ఇంటిదారి పట్టించాడు. యువ ఆటగాడు సిరిల్ వర్మను డెన్మార్క్‌కు చెందిన హాన్స్ క్రిస్టియన్ సొల్‌బెర్గ్ విటింగస్ 21-16, 21-8 తేడాతో వరుస సెట్లలో చిత్తుచేశాడు. ప్రణయ్‌పై రాజీవ్ యూసెఫ్ 21-19, 21-13 తేడాతో విజయం సాధించాడు.