క్రీడాభూమి

మరికొన్ని దరఖాస్తులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 21: టీమిండియాకు కొత్త కోచ్‌ని నియమించే విషయంలో భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) కసరత్తును ముమ్మరం చేసింది. వెస్టిండీస్ టూర్ ముగిసే వరకూ కోచ్‌గా కొనసాగాల్సిందిగా చేసిన సూచనను అనిల్ కుంబ్లే నిరాకరించడంతో బిసిసిఐ కోచ్ పదవికి మరికొన్ని దరఖాస్తులను తీసుకోవాలని నిర్ణయించింది. వారం లేదా పది రోజులపాటు గడువును పెంచడం ద్వారా ఎక్కువ మంది నుంచి దరఖాస్తులు వస్తాయని అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. కుంబ్లే మార్గదర్శకంలో భారత జట్టు 17 టెస్టులు ఆడి, 12 విజయాలు సాధించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని తిరిగి సంపాదించింది. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లోనూ అద్భుత ప్రతిభ కనబరచింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ విభేదిస్తున్నాడన్న ఒకే ఒక విషయాన్ని పక్కకుపెడితే, కుంబ్లేను జట్టు కోచ్‌గా కొనసాగించకపోవడానికి మరే ఇతర కారణం కనిపించడం లేదు. నిజానికి కుంబ్లే పర్యవేక్షణలోనే న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లపై కోహ్లీ బృందం సిరీస్‌లు కైవసం చేసుకుంది. మూడు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌ను కూడా గెల్చుకుంది.
కుంబ్లే వైదొలగడంతో ప్రస్తుతానికి రేసులో సెవాగ్‌తోపాటు, టామ్ మూడీ, లాల్‌చంద్ రాజ్‌పుత్, రిచర్డ్ పీబస్, దొడ్డా గణేష్ ఉన్నారు. మరో వారం రోజుల వ్యవధిలో ఎవరెవరి పేర్లు తెరపైకి వస్తాయో చూడాలి. సెవాగ్‌కు కోచ్ పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నప్పటికీ, అతనిని తీసుకుంటారా అన్నది అనుమానమే. క్రమశిక్షణ విషయంలో సెవాగ్ రాజీపడడు. క్రికెటర్‌గా మంచి పేరు ఉన్నప్పటికీ, కుంబ్లే మాదిరిగానే ఆటగాళ్లను క్రమశిక్షణలు పెట్టడానికి ప్రయత్నిస్తాడు కాబట్టి అతనిని కోచ్‌గా ఎంపిక చేయకపోవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సెవాగ్ తర్వాత రేసులో ముందున్నట్టు వినిపిస్తున్న మరో పేరు రిచర్డ్ పీబస్. దక్షిణాఫ్రికాకు చెందిన అతను క్రికెటర్‌గా రాణించలేకపోయినా, కోచ్‌గా అద్భుతాలు సృష్టించాడు. పాకిస్తాన్ జట్టుకు ఒకప్పుడు కోచ్‌గా సేవలు అందించాడు. మఖయా ఎన్తినీ, డేల్ స్టెయిన్, మోర్న్ మోర్కెల్, అల్బీ మోర్కెల్, ఇమ్రాన్ తాహిర్, ఫఫ్ డు ప్లెసిస్, ఫర్హాన్ బెహర్దీన్, పాల్ హారిస్ తదితరులను అంతర్జాతీయ క్రికెటర్లుగా తీర్చిదిద్దిన ఘనత అతనికే దక్కుతుంది.
ప్రస్తుత పరిస్థితుల్లో, సెవాగ్, పీబస్‌ను మినహాయిస్తే, మిగతా వారిలో ఎవరికీ టీమిండియా కోచ్ పదవి దక్కే అవకాశాలు కనిపించడం లేదు. ఇక కొత్తగా ఎన్ని దరఖాస్తులు వస్తాయో? ఇంకెంత మంది సమర్థులు బరిలోకి దిగుతారో చెప్పలేని పరిస్థితి. ఏది ఏమైనా, కుంబ్లేకు దీటైన కోచ్‌ని ఎంపిక చేయాలన్న పట్టుదలతో బిసిసిఐ చాలా ప్రయత్నాలే చేస్తున్నది. ఈ నేపథ్యంలో కొత్త కోచ్‌పై ఉత్కంఠ మరికొంతకాలం కొనసాగనుంది.