క్రీడాభూమి

కోహ్లీపై కుంబ్లే గుగ్లీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 21: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని మాజీ కోచ్ అనిల్ కుంబ్లే అద్భుతమైన ఎత్తుగడతో చిత్తుచేశాడనే చెప్పాలి. సరైన సమయంలో అతను వేసిన గుగ్లీకి కోహ్లీ ఆత్మరక్షణలో పడిపోయాడు. కోహ్లీకి తనంటే పడడం లేదని, తమ మధ్య సయోధ్య అసాధ్యమని పేర్కొంటూ కోచ్‌గా తన నిష్క్రమణ సమయంలో కుంబ్లే బాంబు పేల్చాడు. అంతకు ముందు, వెస్టిండీస్ టూర్‌కు తాను వెళ్లడం లేదని కుంబ్లే ప్రకటించినప్పుడు, దుబాయ్‌లో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) సమావేశం కారణంగా అతను ఈ నిర్ణయం తీసుకున్నాడని అంతా అనుకున్నారు. అయితే, కోహ్లీ బృందం విండీస్ టూర్‌కు బయలుదేరిన మరుక్షణమే అతను కోచ్ పదవిలో కొనసాగబోనని ప్రకటిస్తూ, విధుల నుంచి వైదొలిగాడు. కోహ్లీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడని, అతని కారణంగానే తాను కోచ్ పదవికి దూరం కావాల్సి వస్తున్నదని తన ప్రకటనలో విస్పష్టంగా పేర్కొన్నాడు. విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి, రాజీనామా విషయాన్ని ప్రకటించి ఉంటే, ఎన్నో ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వచ్చేది. అందుకే, ముందు జాగ్రత్త చర్యగా అతను ప్రకటనకు పరిమితమయ్యాడు. అంతేగాక, తన వ్యాఖ్యలపై స్పందించే అవకాశం కోహ్లీకి లేకుండా జాగ్రత్త పడ్డాడు. కోహ్లీ విండీస్ చేరి, అక్కడ విలేఖరుల సమావేశంలో మాట్లాడేలోగా, తాను ఏ కారణంతో రాజీనామా చేయాల్సి వచ్చిందనే విషయాన్ని కుంబ్లే అందరి మెదళ్లలోకి జొప్పించగలిగాడు. దీనితో కుంబ్లేపై సానుభూతి, కోహ్లీ తీరుపై వ్యతిరేకత పెరుగుతున్నాయి. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో పాకిస్తాన్ చేతిలో టీమిండియా చిత్తుకావడానికి కూడా కోహ్లీ అనుసరించిన విధానాలే కారంమంటూ, కుంబ్లే మాట వినని కారణంగానే ఓటమి తప్పలేదన్న వాదన కూడా జోరందుకుంది. మొత్తం మీద, ఇద్దరి మధ్య వైరుధ్యాలు ఉన్నాయని, ఘర్షణ పూరిత వాతావరణం నెలకొందని వార్తలు వచ్చినప్పుడు కోహ్లీపై ఎలాంటి వ్యాఖ్యలు చేసిన కుంబ్లే, అతను విండీస్ బయలుదేరిన క్షణమే విమర్శనాస్త్రాలు సంధించడం గమనార్హం. కుంబ్లే మంచి వ్యూహకర్త అనే విషయం అతను కోచ్‌గా ఉన్నప్పుడేకాదు.. రాజీనామా చేసినప్పుడు కూడా స్పష్టమైంది.