ఆంధ్రప్రదేశ్‌

రెండేళ్లు పూర్తయిన వారికీ అవకాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 21: టీచర్ల బదిలీల మార్గదర్శకాల్లో ప్రభుత్వం మరోసారి మార్పులు చేసింది. 2017, ఏప్రిల్ 30 నాటికి రెండేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న ఉపాధ్యాయులు సైతం ఈ నెల 23లోపు బదిలీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జీవో నెం.28 జారీ చేసింది. దీని ప్రకారం వందలాది మంది ఉపాధ్యాయులకు అవకాశం లభించింది. ఉపాధ్యాయుల ఆందోళనను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం బదిలీల మార్గదర్శకాల్లో మరోసారి మార్పులు చేసింది. అయితే ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులు కూడా కొత్త మార్పులను తిరిగి సవరించుకునే పనిలేకుండా కంప్యూటర్ ద్వారానే చేర్పులు జరుగుతాయని పాఠశాల విద్యా కమిషనర్ సంధ్యారాణి ఆంధ్రభూమి ప్రతినిధికి తెలిపారు. స్కూల్ సీనియారిటీ పాయింట్ 0.25 శాతం పెంచారు. అయితే సర్వీస్ సీనియారిటీలో ఎలాంటి మార్పు చేయలేదు. బదిలీలపై ఉపాధ్యాయులకు పాయింట్లు కూడా ఇచ్చారు. విద్యార్థుల సంఖ్య రెండేళ్లలో 20 శాతం పెంచితే 4 పాయింట్లు, ఏడాదిలో 20 శాతం పెంచితే 2 పాయింట్లు, పైతరగతికి పంపేవాళ్లలో 95 నుంచి 100 శాతం ఉంటే 4 పాయింట్లు, 94.99 శాతం ఉంటే రెండు పాయింట్లు, ఎస్‌ఎస్‌సి 95-100 శాతం ఉత్తీర్ణత ఉంటే 5 పాయింట్లు, 85-94.99 శాతం ఉత్తీర్ణత ఉంటే నాలుగు పాయింట్లు, 75-85 శాతం ఉంటే 3 పాయింట్లు, 50-74.99 ఉంటే 2 పాయింట్లు, జాతీయ క్రీడలకు విద్యార్థులను పంపితే 5 పాయింట్లు, స్టేట్ గేమ్స్‌కు 3 పాయింట్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.