హైదరాబాద్

టివి ఆర్టిస్టుపై అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం, జూన్ 21: ఓ టివి ఆర్టిస్టుపై అత్యాచారానికి పాల్పడి, మొబైల్‌లో బంధించిన చిత్రాలతో బ్లాక్ మెయిల్ చేస్తున్న వ్యక్తిని ఎల్‌బినగర్ పోలీసులు అరెస్టు చేశారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని నాగోల్‌లో చోటుచేసుకున్న సంఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. నాగోల్‌లో నివాసముంటున్న టివి ఆర్టిస్టు (34)కు అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన మెడికల్ షాపు నిర్వాహకుడు పి. గిరీష్‌తో కొన్నాళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. కాగా 2016లో గిరీష్ వద్ద లక్ష రూపాయలు హ్యాండ్ లోన్ తీసుకుంది. దీంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం మరింత బలపడింది. 2016 నవంబర్‌లో గిరీష్ అప్పుగా ఇచ్చిన లక్ష రూపాయలకు ప్రామిసరి నోటు రాయించుకుందామని నాగోల్‌కు వచ్చాడు. ప్రాంసరి నోటు రాయించుకుంటుండుంగానే కూల్ డ్రింక్‌లో నిద్ర మాత్రలు కలిపి తాగించాడు. దాంతో మత్తులోకి జారుకోగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అశ్లీల చిత్రాలను మొబైల్‌లో బంధించాడు. నాటి నుంచి టివి నటిని అనంతపురం రావాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాడు. రాకపోతే అశ్లీల చిత్రాలను సోషల్ మీడియాలో పెడతానంటూ బ్లాక్‌మెయిల్ చేస్తూ, ఆమెపై లైంగిక వేధింపులు కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాను అప్పుగా ఇచ్చిన డబ్బు చెల్లించాలని, లేనిపక్షంలో అనంతపురం రావాలని ఆదేశించాడు. దీంతో ఆమె భయపడి అనంతపురం వెళ్లింది. అక్కడ గిరీష్ ఒక లాడ్జ్‌లో గది తీసుకుని ఆమెను గదిలో ఉంచాడు. ఆమె తన వద్ద ఉన్న బంగారం, కొంత నగదును గిరీష్‌కు ఇచ్చేసింది. దీంతో గిరీష్ అంతటితో ఆగకుండా గదిలో బంధించి అత్యాచారం చేయబోయాడు. తప్పించుకుని వచ్చి ఈనెల 19 ఎల్‌బినగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అనంతపురం వెళ్లి గిరీష్‌ను అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. కేసు దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.