హైదరాబాద్

ఉపాధ్యాయుల చేతుల్లోనే దేశ భవిష్యత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం, జూన్ 21: దేశ భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంటుందని, విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తయారు చేయాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య సూచించారు. అంబర్‌పేట, సికింద్రాబాద్ నియోజక వర్గాలకు సంబంధించిన మైనారిటీ గురుకుల పాఠశాలలను ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ఆటోనగర్ జాతీయ రహదారిలో నూతనంగా ఏర్పాటు చేశారు. బుధవారం ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య హజరై వాటిని ప్రారంభించారు. కృష్ణయ్య మాట్లాడుతూ అసెంబ్లీలో చేసిన సూచనలను స్వీకరించి ముఖ్యమంత్రి కెసిఆర్.. రాష్టవ్య్రాప్తంగా ప్రతి నియోజకవర్గానికి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు. బడుగు బలహీన వర్గాల పిల్లలు ఉన్నత చదువులు చదివి రాష్ట్రంతో పాటు దేశానికి ఉపయోగపడాలని పిలుపునిచ్చారు. గురుకుల పాఠశాలలోని ఉపాధ్యాయులు చక్కటి విద్యాబోధన చేసి విద్యార్థులను ఉన్నత విలువలతో కూడిన వారిగా తీర్చిదిద్దాలని చెప్పారు. విద్యపై ఆసక్తి ఉండి ఆర్థిక స్థోమతలేని పేద విద్యార్థులు తన వద్దకు వస్తే రూపాయే ఖర్చు లేకుండా చక్కటి వసతులతో కూడిన విద్యను అందించే విధంగా కృషి చేస్తానని కృష్ణయ్య హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కొప్పుల విఠల్ రెడ్డి, జిట్టా రాజశేఖర్ రెడ్డి, సామ తిరుమల్ రెడ్డి, సాగర్ రెడ్డి, ఎం.లక్ష్మిప్రసన్న, పద్మ నాయక్, సామ రమణారెడ్డి, ఎల్బీనగర్ నియోజకవర్గం టిఆర్‌ఎస్ ఇన్‌చార్జి ఎం.రామ్మోహన్ గౌడ్, ప్రిన్సిపాళ్లు సంజీవ రెడ్డి, జైపాల్ పాల్గొన్నారు.