హైదరాబాద్

వారంలో తేలేది కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 21: విద్యుత్ వినియోగ సేవల కోసం శాశ్వత ఉద్యోగాల్లోకి ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని తీసుకోవాలంటే అది చాలా సుధీర్ఘ ప్రక్రియతో ముడిపడిన అంశమని తెలంగాణ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ బుధవారం హైకోర్టుకు తెలిపింది. ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులర్ పోస్టుల్లోకి తీసుకునే అంశం వారం రోజుల్లో తేలేది కాదని కూడా వివరణ ఇచ్చింది. వరంగల్ జిల్లాకు చెందిన శ్రవణ్‌కుమార్ అనే ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ దాఖలు చేసిన పిల్‌పై విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది జి.విద్యాసాగర్ రావు హైకోర్టుకు పై వివరణ ఇచ్చారు. దక్షిణ, ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థలు, తెలంగాణ రాష్ట్ర పవర్ జనరేషన్ కార్పొరేషన్‌లో ఎఇలు, సబ్ ఇంజినీర్లు, ఇంకా కిందిస్థాయి 23,669 రెగ్యులర్ పోస్టుల్లోకి ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని తీసుకునే విధంగా ట్రాన్స్‌కో జారీ చేసిన ప్రోసీడింగ్స్‌ను సవాల్ చేస్తూ శ్రవణ్‌కుమార్ పిల్ దాఖలు చేశారు. పిటీషనర్ తరఫున న్యాయవాది ఈ సందర్భంగా వాదిస్తూ ప్రైవేటు కాంట్రాక్టర్ల ద్వారా ఔట్‌సోర్సింగ్ చేయబడిన సిబ్బందికి ట్రాన్స్‌కో, పంపిణీ సంస్థలకు ఎంతమాత్రం సంబంధం లేదని తెలిపారు. వారిని రెగ్యులర్ ఉద్యోగాల్లోకి తీసుకునే అధికారం ట్రాన్స్‌కోకి లేదని, ఇలా చేయడం వల్ల నిరుద్యోగులకు తీరని అన్యాయం జరుగుతుందని కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా సుప్రీంకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకమవుతుందని కూడా చెప్పారు. సర్వీస్ అంశానికి సంబంధించి ఈ పిటీషన్‌కు ఎలాంటి అర్హత లేదని చెబుతూ, ట్రాన్స్‌కో సంస్థ ఔట్‌సోర్సింగ్ సిబ్బంది అంశంపై సయోధ్య చేస్తోందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు వివరించారు. ఇందుకు పటిషనర్ తరఫు న్యాయవాది స్పందిస్తూ సయోధ్య అనే ప్రసక్తి లేదని, ఔట్‌సోర్సింగ్ వారికి ఉపాధి కల్పించే వారు కాంట్రాక్టర్ అయినందున సాధ్యం కాదని తెలిపారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే కార్మిక శాఖ కమిషనర్ ముందు సయోధ్య అంశం పెండింగ్‌లో ఉందని తెలిపారు. అనంతరం వారం రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదిని ఆదేశిస్తూ ఈ కేసును హైకోర్టు వాయిదా వేసింది.