కృష్ణ

అమరావతిలో హరితహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్) జూన్ 21: ప్రపంచ శ్రేణి రాజధాని నగరంగా అభివృద్ది చేయనున్న నవ్యాంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిని హరిత రాజధానిగా తీర్చిదిద్దనున్నట్టు అమరావతి అభివృద్ధి సంస్థ సిఎండి డి లక్ష్మీపార్థసారథి పేర్కొన్నారు. ఈమేరకు బుధవారం ఎడిసి, అటవీ శాఖాధికారులతో కలిసి అనంతవరంలోని సామాజిక వన విభాగానికి చెందిన నర్శరీని పరిశీలించిన ఆమె అక్కడ పెంచుతున్న వివిధ రకాల పూల మొక్కలు, నీడ నిచ్చే మొక్కలను పరిశీలించిన అనంతరం ఆమె మాట్లాడుతూ ఏడాది కాలంలోని ప్రతి సీజన్‌లోనూ పచ్చదనంతో తోరణం కట్టినట్టుగా కనిపించే విధంగా గ్రీనరీని అభివృద్ధి పర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రస్తుత వర్షాకాలంలో రాజధాని నగరంలో ఎడిసి చేపడుతున్న రహదారులు, ఉద్యానవనాల్లో ఆహ్లాదపర్చే మొక్కలను పెంచాలన్నారు. ప్రధాన అనుసంధాన రహదారి, సప్త రహదార్లపై చెట్ల పెంపకాన్ని చేపట్టాలన్నారు. రాజధాని నగరం వచ్చే సంవత్సరం నాటికి పూర్తి పచ్చదనంతో కనిపించే విధంగా ప్రణాళికలు సిద్ధంచేసి అమలుచేయాలన్నారు. అలాగే శాఖమూరులో నిర్మించనున్న ప్రాంతీయ ఉద్యానవనంలో కూడా ఆకర్షణీయ మొక్కలు అభివృద్ధి చేయాలన్నారు. ఈ పర్యటనలో ఇన్‌చార్జ్ డిఎఫ్‌ఓ భీమయ్య, ఎడిసి అటవీ విభాగాధిపతి బి మురళీకృష్ణ, డెప్యూటీ కన్సర్‌వేటర్ వై రమేష్, అటవీ రేంజ్ అధికారులు ఎం ఒబుల్‌రెడ్డి, జె సుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.