కృష్ణ

పెండింగ్ ఫైల్స్ పరిష్కారానికి నిరంతర కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంజిసర్కిల్, జూన్ 21: ప్రజా అర్జీలతో పాటు సత్వర ఫైళ్ల పరిష్కారానికి మీ సేవా, ఇ-ఆఫీసు విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని కలెక్టర్ బి లక్ష్మీకాంతం తెలిపారు. జవాబుదారీతనం పారదర్శకత ప్రభుత్వ విభాగాల్లో పెంపొందించాలే ఉద్దేశంతో ఇ-ఆఫీసు, మీ-సేవా ప్రవేశపెట్టడం ద్వారా వేగవంతంగా ఫైళ్ల పరిష్కారానికి శ్రీకారం చుట్టామని, వీటి ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. సాంప్రదాయ బద్దంగా ఫైళ్ల నిర్వహణలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో ఇ-ఆఫీసు విధానంలో కచ్చితత్వం ఉంటుందని ప్రతి సెక్షన్ అధికారితో పాటు పై స్థాయి అధికారితో పాటు ఫైళ్ల పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలించే వీలుకలుగుతుందన్నారు. జిల్లా అంతటా ఈ విధానానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్న ఆయన పూర్తి కాగిత రహితంగా జరిగే ఈ విధానంలో జిల్లాలోని గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఈ విధానాన్ని అమలు పరుస్తామన్నారు. జిల్లాలో 93 శాఖల్లో 7765 మంది సిబ్బందికి ప్రభుత్వ మెయిల్స్‌ను కేటాయించడంతో పాటు 6765 మంది గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు డిజిటల్ కీ అందజేయడం జరిగిందన్నారు. అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రానవసరం లేదని, గ్రామ పంచాయితీ కార్యాలయంలో, మండల కార్యాలయంల్లో కూడా తమ అర్జీలు ఏ శాఖకు సంబంధించినవైనా అక్కడ నమోదు చేసుకొని మీకోసంలో రసీదు పొందవచ్చన్నారు. సదరు అర్జీదారునికి సంబంధించిన వివరాలు గ్రామ స్థాయి నుండి మండల స్థాయి అధికారులు ఆపై డివిజన్ స్థాయి అధికారులు, తరువాత జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టరు, తుదిగా ముఖ్యమంత్రి డాష్ బోర్డులో పర్యవేక్షించే విధంగా మీసేవా సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. దీని ద్వారా అర్జీదారునికి సమయం, వ్యయం కూడా ఆదా అవుతుందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఏప్రిల్ 20నాటికి 31 శాఖలకు సంబంధించి 22 శాఖల్లో 31005 పెండింగ్ ఫైల్స్ ఉండగా జూన్ 20నాటికి 14668 ఫైల్స్‌ను పరిష్కరించడం జరిగిందన్నారు. ఇంకా 16337 ఫైల్స్‌ను పరిష్కరించాల్సి ఉందన్న ఆయన అతి తక్కువ సమయంలో అధికశాతం ఫైల్స్‌ను పరిష్కరించడం రెండు మాసాలుగా సాధించిన ప్రగతిగా ఆయన అభివర్ణించారు. అదేవిధంగా పెండింగ్‌లో ఉన్న ఫైళ్లతో పాటు ఇంకా మిగిలిన శాఖలకు సంబంధించిన ఫైళ్లను పరిష్కరించే విధంగా నిరంతరం శ్రమిస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీకాంతం వివరించారు.